గోవాలో దుమారం రేపుతున్న నిహారిక ఫ్రెండ్స్ గ్యాంగ్

0

మెగా డాటర్ కొణిదెల నిహారిక పెళ్లికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. గుంటూరుకు చెందిన ఐజీ జె. ప్రభాకర్ రావు తనయుడు చైతన్య జొన్నలగడ్డతో వివాహం ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇరుకుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆగస్టులో నిహారిక – చైతన్య జొన్నలగడ్డ నిశ్చితార్థం జరిగింది.

డిసెంబర్ లో వీరి పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేశారు. దీంతో పెళ్లి రెండు నెలలే వుండటంతో వర్కవుట్లు చేస్తూ నానా హంగామా చేస్తోందీ మెగా డాటర్. పెళ్లి దగ్గర పడుతుండటంతో తన ఫ్రెండ్స్కి ఇటీవలే అదిరిపోయే బ్యాచిలరట్టీ పార్టీ ఇచ్చేసింది. గోవా బీచ్ కి కళ్లకు గంతలు కట్టి మరీ లాక్కెళ్లారు స్నేహితురాళ్లు. అందుకు సంబంధించిన ఫోటోలను నిహారిక స్వయంగా ఇన్ స్టాలో షేర్ చేసిన సంగతి తెలిసినదే.

ఇక గోవా బీచ్ లో ఒకటే చిలౌట్. నిహారిక ఫ్రెండ్స్ గ్యాంగ్ చిట్టి పొట్టి నిక్కర్లలో చిలౌట్ తో రెచ్చిపోయారు. గోవా బీచ్ లో టైట్ ఫిట్ దుమారం యువతరంలో హాట్ టాపిక్ గా మారింది. బీచ్ పార్టీ ఆద్యంతం ట్రెండీగా చిట్టి పొట్టి స్కర్ట్ లలో హీట్ పెంచింది. నిహారికతో పాటు ఫ్రెండ్స్ షార్ట్స్లో చిలౌట్ అవుతున్న ఫొటోలు ఇన్ స్టాలో వైరల్ గా మారాయి. మరీ ఇంత హాటుగా ఘాటుగానా? అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయ్. అయితే బ్యాచిలర్ పార్టీ అంటే ఆమాత్రం లేకపోతే మజా ఏం ఉంటుందిలే! అని వాళ్లే కూనిరాగాలు తీస్తున్నారు. ఇటీవల పలువురు కథానాయికలు .. హీరోలు కూడా గోవా .. మాల్దీవుల సెలబ్రేషన్స్ ని ఎంజాయ్ చేస్తున్న సంగతి విధితమే.