క్వీన్ ని రౌండప్ చేసిన కిలాడీ గ్యాంగ్ స్టర్స్ ఎవరు?

0

ఎప్పుడు ఏ కామెంట్ చేస్తుందా? ఎవరిపై ఏ ఫిరంగి విసురుతుందో..? ఎప్పుడు ఎవరితో పెట్టుకుంటుందో .. క్వీన్ ఏం చేసినా టెన్షన్ ఎప్పుడూ ఎదుటివారికే. ఇటీవలే ముంబై బీఎంసీ వాళ్లతో.. పాలనలో ఉన్న థాక్రేలతో పెట్టుకున్న క్వీన్ పై ఎప్పుడు ఎలాంటి ఎటాక్ జరుగుతుందోనన్న టెన్షన్ ఓ పట్టాన నిలవనీయడం లేదు.

కారణం ఏదైనా సెంటర్ ఏకంగా వై – కేటగిరీ భద్రతను క్వీన్ కి ఎరేంజ్ చేసింది. ఇంతకుముందు మనాలిలోని కంగన డ్రీమ్ హౌస్ పైనే ఎవరో దుండగులు ఎటాక్ చేశారు. హైదరాబాద్ లో కామ్ గా షూటింగులు చేసుకుంటామంటే వదులుతారా? మొత్తానికి క్వీన్ కి శత్రువుల నుంచి పెద్ద సవాలే ఎదురవుతోంది. అందుకే ఇదిగో ఇలా హైదరాబాద్ సారథి స్టూడియోస్ లో సెక్యూరిటీ వాళ్లు రౌండప్ చేశారు.

కారణం ఏదైనా సారథిలో కంగన రనౌత్ తలైవి షూటింగ్ హాట్ టాపిక్ అయింది. కంగనాకు Y- స్థాయి భద్రత ఇవ్వడమే గాక చుట్టూ గస్తీ కాసేందుకు గన్ మెన్లను ఏర్పాటు చేయడం చూస్తుంటే షాక్ తినాల్సివస్తోంది. రాజకీయాల్లోకి రాకుండానే రాజకీయ నాయకురాలు అయిపోయినంత పనే అయ్యింది. ఆమెను నిరంతరం కాపాడటానికి ప్రత్యేక ఏర్పాట్లు చూస్తుంటే లైవ్ లో ఎవరికీ మాట రావడం లేదు. తలైవి మేకర్స్ ఈ చిత్రం షూట్ సజావుగా జరగడానికి అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో కొన్ని ఎపిసోడ్ల షూటింగ్ తరువాత.. మేకర్స్ సారథి స్టూడియోను బుక్ చేసారట. మొత్తం స్టూడియోను మేకర్స్ బ్లాక్ చేయడమే గాక.. ఎటువంటి ఇబ్బంది ఉండకూడదనుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు సీన్ ఎలా ఉందో!

దాదాపు ఆరేడు నెలల సుదీర్ఘ గ్యాప్ తరువాత కంగన మేకప్ వేసుకుని బరిలో దిగింది. దిగుతూనే దడదడలాడిస్తోంది. తలైవి చిత్రంలో భాగం కావడంతో ఎంతో ఎగ్జయిటింగ్ గా ఉంది. ఇప్పటికే ఈ పాత్ర కోసం కంగనా మేకోవర్ షాకిస్తోంది. రెండు వారాలు హైదరాబాద్ లోనే షూటింగ్ సాగనుందట. ఇక ఇంతకుముందు రిలీజ్ చేసిన వీడియో టీజర్ కి మిశ్రమ స్పందనలు వచ్చినా ఒక గెటప్ లో క్వీన్ పక్కాగానే సూటైంది అన్న ప్రశంసలు దక్కించుకుంది. గ్యాంగ్ స్టర్ కి అయినా ఇంత సెక్యూరిటీ సాధ్యమా? అంటూ చెణుకులు పడిపోతున్నాయ్ క్వీన్ హంగామా చూస్తుంటే.