నిహారిక పెళ్లి సందడి .. పసుపు దంచేశారు

0

Niharika Konidela Pre-Wedding Celebrations

Niharika Konidela Pre-Wedding Celebrations

మెగా ప్రిన్సెస్ నిహారిక – చైతన్య జొన్నలగడ్డ నిశ్చితార్థ వేడుక ఫోటోలు .. వీడియోలు ఇటీవల అంతర్జాలంలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేశారని తెలుస్తోంది. కార్తీక మాసం లేదా మార్గశిర మాసంలో అంటే అక్టోబర్ లేదా నవంబర్ లో పెళ్లి వేడుక జరగనుందని సమాచారం.

ఈలోగానే శ్రావణ మాసం ముగింపులో మంచి రోజులు చూసుకుని పసుపు దంపుడు కార్యక్రమం పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో మెగా ఫ్యామిలీ లేడీస్ అంతా పాలుపంచుకున్నారు. ఆడపడుచులతో కలిసి పెళ్లి కూతురు నిహారిక ఎంత హుషారుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిహారిక స్వయంగా పసుపు దంపుడు వేడుక వీడియోని ఇన్ స్టాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఇది మెగా ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది.

ఇక వరుడు విషయానికొస్తే .. చైతన్య జొన్నలగడ్డ గుంటూరు రేంజ్ ఐజీ కుమారుడు అన్న సంగతి తెలిసిందే. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నారు. అతడి హైట్ ఛామ్ పర్సనాలిటీ చూశాక.. ఇతడు కూడా హీరో అవుతాడు అంటూ అభిమానులు జోస్యం చెబుతున్నారు. పెళ్లి తర్వాత నిహారిక సినిమా నిర్మాతగా కొనసాగుతారని వెబ్ సిరీస్ లు నిర్మిస్తారని భావిస్తున్నారు. దీనిపై మరింత స్పష్ఠత రావాల్సి ఉంది.