బాలయ్య -బోయపాటి మరో కొత్త టైటిల్ ఇదే

0

new title for Balayya Boyapati Movie

new title for Balayya Boyapati Movie

నటసింహా నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ టైటిల్ గత కొంతకాలంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ మూవీ కోసం రకరకాల టైటిల్స్ ని బోయపాటి బృందం పరిశీలించింది. ఇంతకుముందు మోనార్క్ అనే టైటిల్ వినిపించింది. సూపర్ మేన్.. డేంజర్.. మొనగాడు లాంటి టైటిల్స్ కూడా వినిపించాయి.

కానీ ఇవేవీ ఫైనల్ కాలేదని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం `బొనాంజ` అనే టైటిల్ ని చిత్రబృందం ఓకే చేశారని సమాచారం. ఈ మూవీలో అమలాపాల్ కథానాయిక. రెండో నాయికను ఎంపిక చేసుకున్నారు చిత్రబృందం.

కరోనా క్రైసిస్ వల్ల సినిమా చిత్రీకరణ వాయిదా పడింది. షూటింగ్ వచ్చే నెలలో తిరిగి ప్రారంభం కానుంది. ఇందులో బాలయ్య రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. అందులో ఒకటి అఘోరా పాత్ర కాగా.. మరొకటి ఫ్యాక్షనిస్ట్ పాత్ర అని తెలుస్తోంది. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందించనున్నారు.