Templates by BIGtheme NET
Home >> Cinema News >> నితిన్ 30 .. మేర్లపాక దుబాయ్ లో మొదలెట్టాడు

నితిన్ 30 .. మేర్లపాక దుబాయ్ లో మొదలెట్టాడు


యూత్ స్టార్ నితిన్ కథానాయకుడిగా మెర్లపాకా గాంధీ దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైంది. ఈ ఆదివారం నుంచి దుబాయ్ లో షూటింగ్ జరుగుతోంది. నితిన్- నభా నటేష్ జంటపై సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. ఈ ప్రారంభోత్సవం గురించి నితిన్ స్వయంగా వెల్లడిస్తూ ఒక లైవ్ ఫోటోని ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.

“#నితిన్ 30 షూట్ మొదలవుతోంది!! గాంధీ మేర్లపాక ..తమన్నా.. నభా నటేష్.. సాగర్ మహతి“ అంటూ వివరాల్ని నితిన్ పోస్ట్ చేశారు. పోస్టర్ లో నితిన్ పియానో పై సంగీతం ప్లే చేస్తున్నారు. షర్ట్ పై టీ షర్టుతో నితిన్ కనిపిస్తున్నా.. ముఖం ఇందులో స్పష్టంగా కనిపించలేదు.

నితిన్ 30 లో తమన్నా భాటియా-హెబ్బా అందాల ట్రీట్ ఓ లెవల్లోనే ఉంటుందని సమాచారం. జనవరి షెడ్యూల్ లో తమన్నా షూట్ లో చేరనుంది. ఎన్ సుధాకర్ రెడ్డి -నికితా రెడ్డి బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ లో ఆరో చిత్రంగా ఇది తెరకెక్కుతోంది. ఠాగూర్ మధు దీనికి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. సాగర్ మహతి సంగీతం అందించనున్నారు. హరి.కె వేదాంత్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మేర్లపాక సంభాషణలు అందిస్తున్నారు. ఇతర కళాకారులు సాంకేతిక నిపుణులను త్వరలో ప్రకటించనున్నారు. నితిన్ నటించిన రంగ్ దే నిర్మాణానంతర పనులు సాగుతున్నాయి.