ట్యాలెంటెడ్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకున్న నివేథా పేతురాజ్ స్టార్ హీరోల దృష్టిని మాత్రం ఆకర్షించడంలో విఫలం అవుతుంది. పెద్ద సినిమాల్లో చేసినా కూడా సెకండ్ హీరోయిన్ పాత్రలకే పరిమితం అవుతున్న ఈమె ఎట్టకేలకు రామ్ నటించిన ‘రెడ్’ సినిమాలో మెయిన్ లీడ్ గా అది కూడా పోలీస్ ఆఫీసర్ గా నటించే అవకాశం దక్కించుకుంది. ఈ అమ్మడు చేస్తున్న సినిమాలు వరుసగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. నటిగా మంచి పేరు అయితే తెచ్చి పెడుతున్నాయి కాని స్టార్ డం విషయంలో మాత్రం ఈమె ఇంకా వెనుకబడే ఉన్నట్లుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇలాంటి సమయంలో రెడ్ సినిమా నివేథా పేతురాజ్ కు మంచి మార్కులు తెచ్చి పెడుతుందని అంతా నమ్మకంగా అంటున్నారు. ప్రస్తుతం సినిమా విడుదలకు సిద్దం అవుతుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ లో కనిపించిన నివేథా మళ్లీ మంచి మార్కులు దక్కించుకోవడం ఖాయంగా అనిపిస్తుంది. అయితే స్టార్ డం విషయంలో మాత్రం ఈమెకు ఈసారి ఎలాంటి ఫలితం దక్కుతుందో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రెడ్ సినిమా సక్సెస్ అయితే ఈమెకు పెద్ద హీరోల నుండి పిలుపు వచ్చే అవకాశం ఉందంటున్నారు. మరి రెడ్ సినిమా ఈమెకు స్టార్ హీరోల నుండి గ్రీన్ సిగ్నల్ పడేలా చేస్తుందా లేదా అనేది వచ్చే ఏడాదిలో తేలిపోనుంది.