Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఆ బ్యూటీ ప్రభాస్ చెల్లెలుగా నటిస్తుందా…?

ఆ బ్యూటీ ప్రభాస్ చెల్లెలుగా నటిస్తుందా…?


సౌత్ సినీ ఇండస్ట్రీలో టాలెంటెడ్ యాక్ట్రెస్ గా గుర్తింపు తెచ్చుకుంది నివేదా థామస్. బాలనటిగా సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన నివేద కెరీర్ స్టార్టింగ్ నుండి విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకుంటూ వస్తోంది. హీరోయిన్ రోల్స్ మాత్రమే చేస్తానని కూర్చోకుండా వచ్చిన ప్రతి మంచి అవకాశాన్ని వినియోగించుకుంటూ అన్ని వర్గాల ప్రశంసలు అందుకుంది. నాని ‘జెంటిల్ మెన్’ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయిన నివేదా థామస్.. ‘నిన్ను కోరి’ ‘జై లవకుశ’ ‘బ్రోచేవారెవరురా’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘వకీల్ సాబ్’లో నివేద కీలక పాత్రలో కనిపించనుంది. ఇక ఈ బ్యూటీ నటించిన ‘వి’ సినిమాలో సెప్టెంబర్ 5న ఓటీటీలో రిలీజ్ కానుంది. అయితే ఇప్పుడు తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలో నటించే అవకాశం నివేదా థామస్ దక్కించుకుందని వార్తలు వస్తున్నాయి.

కాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ప్రభాస్ కెరీర్లో 21వ చిత్రంగా రానున్న ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో అశ్వినీ దత్ నిర్మించనున్నారు. పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా రూపొందనున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకుణేని హీరోయిన్ గా ఫైనలైజ్ చేసినట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమాలో మరో కీలక పాత్ర ఉందని.. అది కూడా ప్రభాస్ చెల్లెలి క్యారెక్టర్ అని.. దీని కోసం నాగ్ అశ్విన్ నివేదా థామస్ ని సంప్రదించారని న్యూస్ వచ్చింది. ‘కురువు’ ‘జిల్లా’ సినిమాల్లో హీరో చెల్లెలిగా నటించిన నివేదా.. ‘పాపనాశం’ ‘దర్బార్’ చిత్రాల్లో హీరో కూతురిగా నటించింది. హీరోయిన్ గా మాత్రమే నటిస్తాను అని అనుకోకుండా విలక్షణమైన పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ వస్తున్న నివేదా థామస్.. ప్రభాస్ కి సిస్టర్ గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో చూడాలి.