స్టార్ హీరోని .. అస్సలు బొమ్మాళీ వదిలి పెట్టదు కదా!

0

ఎవరో ఒకరిని ఏదో రకంగా ఆడుకోనిదే అస్సలు విడిచిపెట్టని మనస్తత్వం కంగన సొంతం. పురుషాధిక్య ప్రపంచంపైనా తనకు అన్యాయం చేసిన శత్రువులపైనా యుద్ధమే ప్రకటించింది. సోదరి రంగోలితో కలిసి నిరంతరం పోరు సాగిస్తూనే ఉంది. ఈ పోరులో ఇది పరాకాష్ట. నెపోటిజానికే మతిచెడే లా నవతరం నటి సారా అలీఖాన్ ను కూడా వదిలి పెట్టలేదు క్వీన్.

ఇక అప్పటికే పెళ్లయిన హృతిక్ తో ఎఫైర్ సాగించిన కంగన ఆ విషయాన్ని మీడియా ముందే బహిరంగంగా అంగీకరించేందుకు ఏమాత్రం మొహమాటపడదు. ఆయనతో నా ఎఫైర్ నిజం… అంటూనే ఈ గొడవలోకి సుశాంత్ – సారా ని కూడా లాగింది. కేదార్ నాథ్ జంట సుశాంత్ – సారా అలీఖాన్ ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. కానీ సారా ఆ తర్వాతే మాట మార్చింది. ఒత్తిడికి తలొంచింది అంటూ డైరెక్టుగా సైఫ్ ఖాన్ – కరీనా జంటనే ఆడి పోసుకుంది. తల్లిదండ్రులు ఒత్తిడి తేవడం వల్లనే సుశాంత్ తో గదిని షేర్ చేసుకున్న సారా అలీఖాన్ ఇలా చేసింది! అంటూ ఓ నెటిజనుతో ముచ్చట్లలో నిస్సిగ్గుగానే మాట్లాడేసింది.

సుశాంత్ సింగ్- సారా వ్యవహారంపై మీడియా కథనాలెన్నో వచ్చాయి. స్పష్టంగా ఆ జంట ఆరుబయట అందరికీ తెలిసేలా ఒక గదిని షేర్ చేసుకున్నారు. ఈ ఫాన్సీ నేపోటిజం కిడ్స్ హాని కలిగిస్తూ.. బయటివారికి కలలకు దారి ఎందుకు చూపిస్తారు. వారిని బహిరంగంగా డంప్ చేస్తారు“ అంటూ కంగనా డైరెక్టుగానే సారాను టార్గెట్ చేసింది. ఫాన్సీ నేపోటిజం కిడ్ అంటూ తనని దెప్పి పొడిచింది. ఇక ఆ జంట ప్రేమాయణాన్ని కెలుకుతూ మరోసారి హృతిక్ తో తన రహస్య వ్యవహారాన్ని తానే బయట పెట్టేసింది. హృతిక్ కూడా సారా అలీఖాన్ లానే చేశాడని చెప్పేందుకు ప్రయత్నించింది. “హృతిక్ తో పంచుకున్నది ఆ సమయంలో నిజమైనది. అకస్మాత్తుగా అతను ఎందుకు ఇంత శత్రువు అయ్యాడు? అనేది ఇప్పటికీ రహస్యమే!“ అంటూ అతడిపైనా పంచ్ వేసింది క్వీన్. అస్సలు బొమ్మాళీ వదిలి పెట్టదు కదా!