నాగార్జునను అంతగా ఇష్టపడేదాన్ని

0

సీనియర్ హీరోయిన్ కస్తూరి ఇటీవల అలీ టాక్ షో లో పాల్గొంది. ఈ సందర్బంగా ఆమె పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. తన కెరీర్ ఆరంభం నుండి ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్ ల వరకు ఆమె చెప్పిన విషయాలు ఆసక్తిగా సాగాయి. ఆమె నాగార్జునతో ఒక సినిమాలో నటించింది. ఆ సినిమా షూటింగ్ ప్రారంభం రోజు నాగార్జున ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చారట. మొదటి సారి నాగార్జున గారిని చూడటంతో పాటు ఆయన షేక్ హ్యాండ్ ఇవ్వడంతో అలా బిగుసుకు పోయిందట. ఆ చేయిని అలాగే చూసుకుంటూ 24 గంటల పాటు ఆ చేయిని కడుగకుండా అలాగే ఉంచేసిందట.

నాగార్జున గారు అంటే తనకు చాలా అభిమానం అలాంటి వ్యక్తి కనిపించి షేక్ హ్యాండ్ ఇవ్వడంతో నన్ను నేను నమ్ముకోలేక పోయాను అంది. నాగార్జున గారితో ఇప్పుడు ఛాన్స్ వచ్చిన నటించేందుకు సిద్దంగా ఉన్నాను. ఆయనకు భార్యగా నటిస్తాను అంటూ వ్యాఖ్యలు చేసింది. ఇదే టాక్ షో లో ఆమె ఈతరం హీరోల్లో విజయ్ దేవరకొండ అంటే అమితమైన ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది. విజయ్ కి అమ్మ పాత్ర చేయమంటే అస్సలు చేయను అంటూ తేల్చి చెప్పింది.

తన సినీ కెరీర్ లో కొన్ని ఒడి దొడుకులు ఎదుర్కొన్నాను. వాటితో ముందుకు సాగాను అంటూ ఆమె ఎమోషనల్ అయ్యింది. ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించిన కస్తూరి ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. ఇటీవల తన గురించి కొందరు విమర్శలు చేస్తున్నారు. వారికి సమాధానం ఇచ్చేందుకు గాను యూట్యూబ్ ఛానెల్ పెట్టినట్లుగా చెప్పుకొచ్చింది.