‘ఆదిపురుష్’ మేకర్స్ ప్లాన్ అదే…!

0

సినీ ఇండస్ట్రీలో ఎన్నో మార్పులకు కరోనా మహమ్మారి కారణం అవుతోంది. గత ఐదు నెలలుగా షూటింగ్స్ బంద్ అయ్యాయి.. సినిమా థియేటర్స్ క్లోజ్ అయ్యాయి. ఇప్పట్లో సినిమా థియేటర్స్ తెరుస్తారో లేదో.. తెరిచినా థియేటర్స్ దొరుకుతాయో లేదో అనే ఆలోచనతో కొందరు మేకర్స్ తమ సినిమాలను ఓటీటీలలో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఓటీటీలో విడుదల చేస్తే థియేటర్ రిలీజ్ కి వచ్చే రేంజ్ లో ప్రాఫిట్స్ ఉండకపోవచ్చు. అందుకే రాబోయే రోజుల్లో సినిమా బడ్జెట్ విషయంలో మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించే మేకర్స్ ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో థియేటర్ బిజినెస్ ఎలా ఉంటుందో అని భావించిన టీ- సిరీస్ వంటి కార్పోరేట్ కంపెనీస్ కూడా జాగ్రత్తగా సినిమాలు అనౌన్స్ చేస్తున్నాయి.

కాగా టీ – సిరీస్ భూషణ్ కుమార్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ‘ఆదిపురుష్’ అనే సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రభాస్ నటించిన ‘సాహో’ ‘రాధే శ్యామ్’ చిత్రాల నిర్మాణంలో భాగస్వామ్యం పంచుకున్న టీ – సిరీస్ వారు ఇప్పుడు ప్రభాస్ తో నేరుగా బాలీవుడ్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ దర్శకత్వం వహించనున్నారు. ప్రభాస్ కెరీర్లో 22వ చిత్రంగా రానున్న ‘ఆదిపురుష్’ని వచ్చే ఏడాది సెట్స్ మీదకు తీసుకెళ్లి 2022లో రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. 3డీలో తెరకెక్కబోతున్న ఈ మూవీని 2022లో విడుదల చేయడం సాధ్యమేనా అని అందరూ ఆలోచించారు.

అయితే ఈ చిత్రానికి ప్రభాస్ కేవలం 70 రోజుల డేట్స్ మాత్రమే కేటాయించాడట. అంతేకాకుండా ఈ సినిమాని లిమిటెడ్ బడ్జెట్ తో ఎక్కువ భాగం గ్రీన్ మ్యాట్ మీదే షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అందుకే రిస్క్ లేకుండా వీలైనంత త్వరగా ప్రాజెక్ట్ పూర్తి చేసే ఆలోచనో ఉన్నారట. రాబోయే రోజుల్లో థియేటర్ బిజినెస్ ఎలా ఉంటుందో అని హాలీవుడ్ ‘అవతార్’ లాంటి భారీ ప్రాజెక్ట్స్ కన్ఫ్యూజన్ లో ఉంటే.. మనం రిస్క్ తీసుకోవడం ఎందుకని మేకర్స్ ఆలోచిస్తున్నారట. ఇప్పుడు దాదాపు పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ అన్నీ ఇలాంటి ఆలోచనతోనే ముందుకెళ్తున్నామని సమాచారం.