బాడీ ఫిట్ డ్రెస్ కి 2లక్షలు పెట్టిన మనోహరి

0

అక్షరాల 2 లక్షల రూపాయలు. ఈ వైట్ బాడీకాన్ దుస్తులలో నోరా ఫతేహి ఒక అందమైన కలలా కనిపిస్తోంది అంటూ అభిమానులు గుస్సాయించేస్తున్నారు.

నోరా ఫతేహి ఫ్యాషన్ ఎంపికలతో నిరంతరం చర్చల్లో ఉంటుంది. తనను తాను ఫ్యాషన్ ఐకన్ గా ఈ భామ ఏనాడో ప్రకటించుకుంది. అది చీర అయినా.. గౌను అయినా.. అల్ట్రా మోడ్రన్ డిజైనర్ వేర్ అయినా.. ఎలా హైలైట్ చేయాలో ఈ అమ్మడికే తెలుసు. తాజా ఫోటోషూట్ కి `వైల్డ్ థింకింగ్ (sic)` అనే క్యాప్షన్ ఇచ్చింది.

తెలుపు బాడీకాన్ దుస్తులు నోరా లోని వొంపు సొంపుల్ని ఎలివేట్ చేస్తున్నాయి. ఆ వెండి మడమ చెప్పులు మరో హైలైట్ . ఈ దుస్తులు పారిసియన్ డిజైనర్ హెర్వ్ లెగర్ చేత రూపొందించబడినవి. నోరా ఫతేహి కెరీర్ సంగతి చూస్తే.. ఇటీవల రియాలిటీ డ్యాన్స్ షో `ఇండియా బెస్ట్ డాన్సర్`లో కనిపించింది. షో షూటింగ్ ముగిశాక విహారయాత్రకు గోవాకు వెళ్లింది ఈ భామ. `భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా`లో నోరా కీలక పాత్రలో కనిపించనుంది.