దర్శకేంద్రుని `పెళ్లి సందడి`కి కొత్త జంట ఫిక్స్?

0

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు త్వరలో కొత్త చిత్రంతో కంబ్యాక్ కోసం సీరియస్ ట్రయల్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే టైటిల్ `పెళ్లి సందడి` అని ప్రకటించి షాకిచ్చారు. శతాధిక చిత్రాల హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ ను హీరోగా రీలాంచ్ చేయనున్నారని తెలుస్తోంది.

అయితే రోషన్ సరసన నటించే భామ ఎవరు? అతడి స్మార్ట్ లుక్ కి సరిపడే అందగత్తెను వెతికారా లేదా? అంటే తాజా సమాచారం ప్రకారం.. హీరోయిన్ ఫిక్సయ్యిందని తెలుస్తోంది. సీనియర్ దర్శకుడు శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్ ఈ చిత్రంలో కథానాయికగా నటించడానికి ఆసక్తి చూపుతోందట. ఇప్పటికే దర్శకేంద్రుడు బోనీని- ఖుషీని సంప్రదించారని చెబుతున్నారు.

అయితే ఇది నిజమా కాదా? అన్నది తెలియాలంటే కాస్త ఆగాలి. రాఘవేంద్రరావు బాహుబలి మేకర్స్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. ఆయనే దర్శకత్వం వహించనున్నారు. ఇకపోతే ఖుషీని ఫైనల్ చేసినట్టయితే జాన్వీ కపూర్ కంటే ముందే టాలీవుడ్ ఎంట్రీకి జాక్ పాట్ కొట్టేసినట్టే.