`బన్ని- రౌడీ` వ్యక్తిగత స్టైలిస్ట్ చెప్పిన షాకింగ్ నిజాలు

0

టాలీవుడ్ హీరోల్లో స్టైల్ ఐకాన్స్ గా పాపులరయ్యారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్… రౌడీ హీరో విజయ్ దేవరకొండ. వీరిద్దరికి స్టైల్ అండ్ ఫ్యాషన్ కి యూత్ లో మంచి క్రేజ్ వున్న విషయం తెలిసిందే. అయితే ఆ ఇద్దరినీ ఆ స్థాయిలో నిలిపిన కామన్ స్టైలిస్ట్ బాలీవుడ్ కు చెందిన హర్మాన్ కౌర్. ఇటీవల ఓ బాలీవుడ్ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు ఆమె. బన్నీ క్లాసీ స్టైల్స్ తో స్టైలిష్ స్టార్ గా పేరు తెచ్చుకుంటే సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తనదైన మార్కు బోల్డ్ స్టైల్స్ తో యూత్ ఐకాన్ గా మారిపోయాడని అసలు గుట్టు విప్పేసారు.

ఇక ఈ ఇద్దరు హీరోల్లో ఏ డ్రెస్ లు వేసుకోవడానికి ఇష్టపడరో హర్మాన్ కౌర్ సీక్రెట్ ని ఓపెన్ చేసేయడం ఆసక్తికరం. విజయ్ దేవరకొండ సైడ్ బెల్ట్ ఉన్న ప్యాంట్ ని వేసుకోవడానికి అస్సలు ఇష్టపడరట. ఇక బన్నీ ఒక్క ప్యాకెట్ వున్న షర్ట్ ని ధరించడానికి ఇష్టపడరు. ఇక స్టైల్ పరంగా ఈ ఇద్దరు హీరోలు ఏ విషయంలోనూ తక్కువ కాదని ఇద్దరూ సమానమేనని స్పష్టం చేసింది. ఇక ఈ ఇద్దరు హీరోలు ఎలాంటి యాక్ససరీస్ ధరించడానికి ఇష్టపడతారో ఆ రహస్యాన్ని కూడా చెప్పేశారు స్టైలిస్ట్ హర్మాన్.

బన్నీగాగుల్స్ ధరించి జెంటిల్ మోన్ గా కనిపించడానికి ఇష్టపడతారని… విజయ్ మాత్రం హ్యాట్ లు ధరించేందుకు ఆసక్తి చూపిస్తారని తెలిపింది. సెలబ్రిటీ స్టైలిస్ట్ ఆ ఇద్దరి కోసం స్టైల్ చేసిన చాలా వైరల్ లుక్స్ డీకోడ్ చేసింది. అర్జున్ శైలి గురించి ప్రత్యేకంగా చెప్పింది. తను ఏమి కోరుకుంటున్నాడో.. ఏమి వద్దనుకుంటాడో అతనికి తెలుసు. నలుపు.. తెలుపు.. బూడిద మరియు లేత గోధుమ రంగులను కలిగి ఉన్న ఒక నిర్దిష్టమైన రంగుల పాలెట్ ని బన్నీ ఫాలో అవుతాడని చెప్పింది. శరీరాకృతిని బట్టి స్ట్రెయిట్ ఫిట్ ప్యాంట్ ఎలా ధరించవచ్చనే దానిపై ఆడియన్స్ కి కొన్ని సూచనలు చేసింది. ఇక అల్లు అర్జున్ తో తనకు విభేధాలు ఉన్నాయని వెల్లడించింది. అయితే ప్రస్తుతం ఆ విభేధాలు తొలగిపోయాయని స్పష్టం చేసింది.