Templates by BIGtheme NET
Home >> Cinema News >> నవంబర్ బాక్సాఫీస్ ఫైట్.. క్రేజీ సినిమాలే కానీ..

నవంబర్ బాక్సాఫీస్ ఫైట్.. క్రేజీ సినిమాలే కానీ..


నవంబర్ నెలలో రొటీన్ కు భిన్నంగా కాస్త డిఫరెంట్ సినిమాలు ఎక్కువగా రాబోతున్నాయి. కానీ బజ్ మాత్రం అంతగా కనిపించడం లేదు. అందులో కొన్ని బిగ్ బడ్జెట్ డబ్బింగ్ సినిమాలు కూడా వాటి అదృష్టాన్ని తెలుగు బాక్స్ ఆఫీస్ వద్ద పరీక్షించుకోబోతున్నాయి. నవంబర్ ఫస్ట్ వీక్ 3వ తేదీన రానున్న సినిమాల్లో కాస్త ఎక్కువగా తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన కీడా కోలా మాత్రమే చెప్పుకోదగినది.

ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ బాగానే ఆకట్టుకుంది. డార్క్ కామెడీతో ఈసారి సక్సెస్ అందుకోవాలి అని తరుణ్ భాస్కర్ గట్టిగానే ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నాడు. అలాగే ఓటీటీ లో సక్సెస్ అయిన పొలిమేర సినిమాకు సీక్వెల్ గా ఈసారి పొలిమేర 2 థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ఎంతవరకు క్లిక్ అవుతుందో చూడాలి.

అలాగే నరకాసుర, విధి అనే సినిమాలు కూడా మూడవ తేదీన రాబోతున్నాయి. ఇక 4వ తేదీన కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటించిన ఘోస్ట్ సినిమా తెలుగులో విడుదలవుతోంది. వీటికి అంతగా బజ్ లేదు. నవంబర్ రెండవ వారం మెగా ఉప్పెన హీరో వైష్ణవ తేజ్ ఆదికేశవ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. శ్రీ లీల తప్పితే సినిమాను ఎందుకు చూడాలి అనే ప్రశ్నలకు సమాధానం లేదు, ప్రమోషన్స్ సౌండ్ కూడా లేదు.

ఇక దీనికి పోటీగా అదే రోజు రాఘవ లారెన్స్ ఎస్ జె సూర్యల తమిళ్ మూవీ జిగర్తండా డబుల్ ఎక్స్ తెలుగులో విడుదల కాబోతోంది. ఇక వీటితోపాటు ఎర్రచీర ఒక చిన్న మూవీ కూడా అదే రోజు విడుదలవుతోంది. తర్వాత నవంబర్లో దీపావళికి కార్తీ జపాన్ సినిమా కూడా రాబోతుంది. దీని డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు. కానీ ఆ టైమ్ లో వచ్చి క్లిక్ అయితే బయ్యర్లకు లక్కే

ఇక సల్మాన్ ఖాన్ టైగర్ 3 సినిమా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో నవంబర్ 12న గట్టిగానే విడుదలవుతోంది. నవంబర్ మూడో వారంలో మంగళవారం, స్పార్క్, సప్త సాగరాలు దాటి సైడ్ B రానున్నాయి. వీటిలో పాయల్ రాజ్ పూత్ మంగళవారం కాస్త ఎక్కువగానే హైప్ క్రియేట్ చేస్తోంది. అలాగే స్పార్క్ నటీనటులు కొత్తవారే అయిన్నప్పటికి ప్రమోషన్స్ తో బాగానే హడావిడి చేస్తున్నారు. కంటెంట్ డిఫరెంట్ గా ఉండనుంది అని చిత్ర యూనిట్ బలంగా చెబుతోంది.

ఇక సప్తసాగరాలు దాటి తెలుగులో మొదటి భాగం పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ ఇప్పుడు రెండవ భాగాన్ని కూడా డబ్ చేసి విడుదల చేస్తున్నారు. నవంబర్ 24వ తేదీన ఎలాంటి పోటీ లేకుండా కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఈ సినిమాకు దర్శకుడు స్థానంలో నిర్మాత తన పేరు వేసుకున్నాడు అనే కాంట్రవర్సీ తప్ప కంటెంట్ తో మాత్రమే ఇప్పటివరకు హైప్ క్రియేట్ చేయలేదు. మరి రిలీజ్ టైమ్ లో సినిమాకు ఎలాంటి ప్రమోషన్ చేస్తారో చూడాలి. మొత్తంగా నవంబర్ లో క్రేజీ సినిమాలు సందడి చేయబోతున్నాయి. మరి వీటిలో ఏది బాక్సాఫీస్ వద్ద బిగ్ హిట్ గా నిలుస్తుందో చూడాలి.