Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఎర్ర‌కోక‌లో నోరా కెవ్వు కేక‌

ఎర్ర‌కోక‌లో నోరా కెవ్వు కేక‌


బాహుబలి మ‌నోహ‌రి నోరా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఇటీవ‌ల నోరా ఫతేహి తన హాట్ వీడియోల‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో నిప్పులు కురిపిస్తోంది. బిగ్ బాస్‌లో పాల్గొన్న తర్వాత నోరా ఇండియాలో పాపుల‌ర్ న‌ర్త‌కిగా, న‌టిగా ఎదిగింది. నిరంత‌రం బోల్డ్ దుస్తులలో రేసీ ఫోటో షూట్‌లతో సోషల్ మీడియాల్లో తుఫాన్ గా మారుతున్న నోరా ఇప్పుడు జియో వరల్డ్ ప్లాజా లాంచ్‌లో రెడ్ హాట్ శారీలో క‌నిపించింది. క‌ళ్లు తిప్పుకోనివ్వ‌ని ఆకర్షణీయమైన చీరలో తన వంపుసొంపులను ప్రదర్శిస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో ఇప్పుడు దూసుకుపోతోంది.

నటి కం నర్తకి నోరా ఫ‌తేహి ఎర్ర‌ చీరలో టూ హాట్ గా కనిపించింది. ఈ లుక్ వెబ్ ప్రపంచాన్ని ఒక్క కుదుపు కుదిపింది అంటే అతిశ‌యోక్తి కాదు. ఎరుపు రంగు సిజ్లింగ్ చీరలో నోరా ర్యాంప్‌పై క్యాట్ వాక్ చేస్తుంటే క‌ళ్ల‌న్నీ త‌న‌వైపే.. క‌చ్ఛితంగా ఈ వేదిక‌కు నోరా షో స్టాప‌ర్ అనడంలో సందేహం లేదు. ఎర్ర‌కోక‌లో నోరా కెవ్వు కేక అంటూ అభిమానులు తాజా లుక్ పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఇటీవల నోరా బాంబే ఫ్యాషన్ వీక్ కోసం ర్యాంప్ వాక్ చేసింది. త‌న దేహ‌శిరుల‌కు త‌గ్గ‌ట్టుగానే నెక్‌లైన్‌ని కలిగి ఉన్న స్కిన్ టైట్ గౌనులో అబ్బురపరిచింది. ఇంత‌లోనే ఇప్పుడిలా రెడ్ హాట్ లుక్ తో గుబులు పెంచింది. బాలీవుడ్‌లో నంబర్ వన్ న‌ర్త‌కిగా, పెర్ఫార్మర్‌గా పేరుగాంచిన నోరా తన సంచలన ప్రదర్శనలతో ప్రపంచవ్యాప్త భారీ ఫాలోయింగ్ ని ఆస్వాధిస్తోంది. త‌న‌కంటూ అంకితమైన అభిమానుల సంఖ్యను ఇన్ స్టా వేదిక‌గా సంపాదించుకుంది.

నోరా త‌దుప‌రి బిగ్ ఈవెంట్ గురించి తాజాగా అప్ డేట్ అందింది. ఆల్ ఆఫ్రికా ఫెస్టివల్‌లో నోరా ఫతేహి వారం రోజుల పాటు టూర్ కి వెళ్ల‌నుంది. ఈ కార్యక్రమంలో ఇతర అంతర్జాతీయ గాయకులు, కాంగో-ఫ్రెంచ్ రాపర్ మైట్రే గిమ్స్, స్టోన్‌బ్వోయ్, ఘనా ఆఫ్రోపాప్, డ్యాన్స్‌హాల్ , రెగె త‌దిత‌ర‌ సంగీతకారులు కూడా పాల్గొంటారు.

నోరా వరుణ్ తేజ్ – మట్కాతో తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా అడుగుపెట్టనుంది . `క్రాక్` అనే స్పోర్ట్స్-యాక్షన్ చిత్రంలో విద్యుత్ జమ్వాల్ సరసన నటించనుంది. అభిషేక్ బచ్చన్‌- రెమో డిసౌజా కాంబినేష‌న్ మూవీ `బీ హ్యాపీ`లో… కునాల్ ఖేము -మడ్‌గావ్ ఎక్స్‌ప్రెస్ చిత్రాల్లోను నోరా న‌టిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)