దుబాయ్ ట్రిప్ వెళుతూ తారక్ తో చిక్కిన అభయ రాముడు

0

ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరోలు దుబాయ్ ప్రయాణానికి మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. కుటుంబ సమేతంగా విహార యాత్రకు వెళ్లి వస్తున్నారు. కోవిడ్ మహమ్మారీ నుంచి కాస్త రిలీఫ్ దొరకగానే ఇలా విమానయానాలకు రెడీ అయ్యారు. ఇంతకుముందే మహేష్ ఫ్యామిలీ దుబాయ్ ట్రిప్ ముగించి హైదరాబాద్ లో దిగింది.

ఇంతలోనే తారక్ కూడా కుటుంబ సమేతంగా దుబాయ్ ట్రిప్ కి బయల్దేరాడు. తాజాగా హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో ప్రత్యక్షమయ్యాడిలా. కుటుంబ విహారానికి దుబాయ్ వెళ్లేముందు విమానాశ్రయంలో ఇలా కుటుంబంతో కనిపించాడు. తనతో పాటే భార్య లక్ష్మీ ప్రణతి- వారసుడు అభయ్ రామ్ ఉన్నారు.

ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్న తారక్ చిన్న పాటి గ్యాప్ లో ఇలా మినీ ట్రిప్ ప్లాన్ చేశారట. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో ఉన్నప్పటి ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి. తారక్ కొడుకు.. భార్యతో కలిసి విమానాశ్రయంలో నడుస్తున్నప్పుడు స్పోర్ట్స్ క్యాజువల్ లుక్ ఫోటోల్లో చూడవచ్చు. మహమ్మారి నుంచి భద్రత కోసం ఇంటిల్లిపాదీ మాస్కులు ధరించారు. ప్రస్తుత పరిస్థితి కారణంగా ఈ జంట తమ రెండు సంవత్సరాల కుమారుడు భార్గవ రామ్ ను విహారయాత్రకు తీసుకు వెళ్లలేదు. ఈ చిన్నపాటి ట్రిప్ ముగించి తిరిగి చరణ్ తో పాటు షూట్ లో తారక్ కూడా జాయిన్ అవుతాడట.