Templates by BIGtheme NET
Home >> Cinema News >> ద్రవ పదార్థాలు మాత్రమే ఆహారంగా తీసుకుంటున్న పవన్..!

ద్రవ పదార్థాలు మాత్రమే ఆహారంగా తీసుకుంటున్న పవన్..!


టాలీవుడ్ స్టార్ హీరోలందరూ రెగ్యులర్ గా వర్కౌట్స్ చేయడంతో పాటు పర్ఫెక్ట్ డైట్ మెయింటైన్ చేస్తూ ఫిజిక్ ని కాపాడుకుంటూ ఉంటారు. అలానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా జిమ్ చేస్తూ వచ్చాడు. అయితే పవన్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఫిజిక్ మీద కాస్త ఫోకస్ తగ్గించినట్లు కనిపించింది. సినిమాలను పక్కన పెట్టి పాలిటిక్స్ పైనే ఫోకస్ పెట్టిన పవన్.. లుక్ విషయంలో కూడా పెద్దగా కేర్ తీసుకున్నట్లు అనిపించలేదు. అయితే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని డిసైడైన తర్వాత ‘వకీల్ సాబ్’ కోసం లుక్ లో కాస్త వేరియేషన్ చూపించాడు. ఈ క్రమంలో సన్నగా మారడం కోసం ఇప్పుడు పవన్ కేవలం ద్రవ పదార్ధాలను మాత్రమే తీసుకుంటూ డైట్ మెయింటైన్ చేస్తున్నాడట.

కాగా వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు – శిరీష్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇది బాలీవుడ్ ‘పింక్’ చిత్రానికి రీమేక్ అయినప్పటికీ తెలుగులో పవర్ స్టార్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని పలు చేంజెస్ చేసారని తెలుస్తోంది. ముఖ్యంగా పవన్ కోసం ఓ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని కూడా క్రియేట్ చేసారట. అందులో పవన్ సన్నగా కనిపించాల్సి ఉండగా.. దాని కోసం లిక్విడ్ డైట్ ఫాలో అవుతున్నాడట. పవన్ గతంలో ‘జానీ’ సినిమా కోసం కష్టపడి సన్నగా మారాడు. అలానే చాతుర్మాస్య దీక్ష సమయంలో కూడా స్ట్రిక్ట్ డైట్ ఫాలో అయ్యాడు. ఇప్పుడు మాత్రం లిక్విడ్ డైట్ ని పాటిస్తూ సన్నాబడాలని చేస్తున్నాడట. ప్రస్తుతం షూటింగ్ కి కాస్త బ్రేక్ ఇచ్చిన పవన్.. మెగా డాటర్ నిహారిక వివాహం అనంతరం ‘వకీల్ సాబ్’ ఫైనల్ షెడ్యూల్ లో పాల్గొననున్నాడు. ఇది పూర్తైన వెంటనే సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో ‘అయ్యప్పనుమ్ కోషియం’ తెలుగు రీమేక్ స్టార్ట్ చేయనున్నాడు.