నటించిన తొలి సినిమాతోనే యువతరం మనసు దోచింది పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్. ఆర్.ఎక్స్ 100 లాంటి బ్లాక్ బస్టర్ తో ఘనమైన ఆరంగేట్రం చేసిన పాయల్ కి ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ సరసన `వెంకీమామ`లో నటించే ఆఫర్ దక్కింది. ఆ సినిమా విజయం సాధించింది. కానీ ఎందుకనో ఆ తరవాత ఆశించిన స్థాయి అవకాశాలైతే రాలేదు. ఆ క్రమంలోనే పాయల్ కోలీవుడ్ లోనూ అవకాశాల కోసం ప్రయత్నించింది. కానీ అక్కడా కెరీర్ అంతంత మాత్రమే.
ఇక ఇటీవల ఆర్.ఎక్స్ 100 దర్శకుడితోనే మరో సినిమా చేసేందుకు సన్నాహకాల్లో ఉందన్న ప్రచారం సాగింది. ఇంతలోనే ఆది సాయికుమార్ సరసన నటించేందుకు సంతకం చేసింది. ఆది – పాయల్ జంటగా కిరాతక ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పూర్తి చేసుకుని చిత్రీకరణకు సిద్ధమవుతోంది. ఆగస్టు నుంచి పాయల్ సెట్స్ లో జాయిన్ కానుందని సమాచారం.
కిరాతక కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్. టైటిల్ కి తగ్గట్టే కఠోరమైన ఆలోచనలు ఉన్న కుర్రాడి కథ ఇది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ కథాంశంతో చుట్టాలబ్బాయి ఫేం వీరభద్రమ్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ ఆగస్టు 12న ప్రారంభమవుతుంది. పాయల్ తో ఆది రొమాన్స్ మరో లెవల్ లో ఉంటుందన్న గుసగుసా వినిపిస్తోంది. కొన్ని వరుస ఫ్లాప్ ల తర్వాత ఆది సాయికుమార్ సరైన హిట్ కోసం వేచి చూస్తున్నారు. ఆ క్రమంలోనే కిరాతకపై అతడు చాలా హోప్స్ పెట్టుకున్నాడట. పాయల్ కి కూడా సరైన విజయం అవసరం. భాయ్ లాంటి ఫ్లాప్ తర్వాత వీరభద్రమ్ పేరు మసకబారింది. అందుకే ఇక వీరభద్రమ్ విజన్ పైనే అందరి భవిష్యత్ ఆధారపడి ఉంది. విజన్ సినిమాస్ – శివత్రి ఫిల్మ్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నాగం తిరుపతి రెడ్డి – పి. మన్మధారావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
