పెళ్లిసంద’D’ టైటిల్లో ‘D’ వెనకాల పెద్ద స్టోరీయే ఉందట!

0

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు శ్రీకాంత్ కాంబినేషన్లో వచ్చిన పెళ్లి సందడి సినిమా ఆ కాలంలో సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ సినిమాతో శ్రీకాంత్ కు మంచి ఇమేజ్ వచ్చింది. ఇక ఆ సినిమాలోని పాటల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎం.ఎం కీరవాణి అద్భుతమైన బాణీలు ఇచ్చారు. సినిమాలో ప్రతి పది నిమిషాలకు సాంగ్ వస్తూ ప్రేక్షకులు మైమరిపిస్తుంది. అంత అద్భుతమైన సాంగ్స్ ఉన్నాయి అందులో. ఇప్పటికే పెళ్లి సందడి సినిమా వస్తుంటే చానల్ మార్చకుండా చూస్తూ ఉంటారు. అలాంటి పెళ్లి సందడి సినిమా పేరుతో మరోసారి రాఘవేంద్ర రావు నుంచి సినిమా వస్తోంది. అయితే ఈ సారి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించడం లేదు. కేవలం దర్శకత్వ పర్యవేక్షణ మాత్రమే చేపట్టనున్నారు. హీరో కూడా ఎవరో కాదు. శ్రీకాంత్ కొడుకు రోషనే. రోషన్ కి ఇది రెండో సినిమా. ఇదివరకు అతడు నాగార్జున నిర్మాతగా నిర్మల కాన్వెంట్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమా పేరు పెళ్లి సందడి అని కాకుండా ‘ పెళ్లి సంద D’ అని ఆంగ్ల అక్షరం తో ముగింపు ఇచ్చారు. సినిమా టైటిల్ లో ‘ డి ‘ అనే అక్షరం సరదాగానో స్టయిల్ గా ఉంటుందని పెట్టింది కాదని తెలుస్తోంది. ఆ ‘డి’ కి సినిమాలో చాలా ప్రాధాన్యం ఉందని చెబుతున్నారు. ఈ సినిమాలో రోషన్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. ఒక పాత్రలో కొత్తమ్మాయి నటిస్తుండగా మరో పాత్ర కోసం స్టార్ హీరోయిన్ ను ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంకా ఎవరు నటించేది కన్ఫర్మ్ కాలేదు. పెళ్లి సందడి కి అద్భుతమైన సంగీతం అందించిన కీరవాణి ఈ సినిమాకి కూడా మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే ఆ పాటలకు ట్యూన్స్ కూడా సిద్ధమయ్యాయని సమాచారం. శ్రీకాంత్ కి నటుడిగా ఒక మైలురాయిగా నిలిచిన పెళ్లి సందడి.. అతడి కుమారుడి కెరీర్ కూ ఎంతగా ఉపయోగపడుతుందో చూడాలి.