బాలయ్య BB3 నుంచి ఆ హీరోయిన్ ని తప్పించారా..?

0

నందమూరి బాలకృష్ణ – డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో హ్యాట్రిక్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. నవంబర్ 16 నుంచి బాలయ్య సెట్స్ లో అడుగుపెడతారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా బాలకృష్ణ సరసన నటించే హీరోయిన్ ని ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఈ మధ్య BB3 సినిమా కోసం మలయాళ బ్యూటీ ప్రయాగ మార్టిన్ మరియు ‘అవును’ ఫేమ్ పూర్ణ ని హీరోయిన్స్ గా ఎంపిక చేసారని వార్తలు వచ్చాయి. ఈ న్యూస్ వచ్చి వారం కూడా గడవకముందే ఇప్పుడు బాలయ్య సినిమా నుంచి హీరోయిన్ ని తొలగించారని ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.

బాలకృష్ణ సినిమాతో ప్రయాగ మార్టిన్ బాలీవుడ్ కి పరిచయం అవుతుందని అందరూ భావించారు. అయితే ఇటీవల బాలయ్య – ప్రయాగ జోడీకి లుక్ టెస్ట్ చేసిన చిత్ర యూనిట్.. ఈ జోడీ సెట్ అవడంలేదనే నిర్ధారణకు వచ్చారట. టెస్ట్ షూట్ లో 60 ఏళ్ళ బాలయ్య సరసన 25 ఏళ్ళ ప్రయాగ మార్టిన్ మరీ చిన్నపిల్లలా కనిపించిందట. దీంతో మార్టిన్ ను ఈ సినిమా నుంచి తప్పించి మరో హీరోయిన్ కోసం వెతుకులాట ప్రారభించారట. ఈ నేపథ్యంలో ‘కంచె’ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ ని హీరోయిన్ గా తీసుకునే ఆలోచన చేస్తున్నారట. ప్రగ్యా ఇంతకముందు బోయపాటి శ్రీను తీసిన ‘జయ జానకి నాయక’ సినిమాలో సెకండ్ హీరోయిన్ నటించిన సంగతి తెలిసిందే. అందులోనూ ప్రగ్యా ఇంతకముందు అక్కినేని నాగార్జున వంటి సీనియర్ హీరోతో నటించి ఉండటంతో ఇప్పుడు బాలయ్యకు కూడా సెట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారట. మరి త్వరలోనే హీరోయిన్ విషయంలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.