హీరోయిన్ తో టీం ఇండియా స్టార్ క్రికెటర్ లవ్ నిజమే

0

ఈమద్య కాలంలో ప్రముఖ క్రికెటర్లు ఎక్కువ శాతం హీరోయిన్స్ లేదా మోడల్స్ తో ప్రేమలో పడటం మనం చూస్తూ ఉన్నాం. విరాట్ కోహ్లీ అనుష్క శర్మల తర్వాత పలువురు స్టార్ కపుల్స్ ఇప్పటికే మీడియా ముందుకు అధికారికంగా వచ్చారు. మరి కొందరు కూడా ఇంకా ప్రేమలో ఉన్నట్లుగా పుకార్లు వస్తున్నాయి. తాజాగా కేఎల్ రాహుల్ విషయమై క్లారిటీ వచ్చింది. గత కొంత కాలంగా ఈయన హీరోయిన్ అతియా శెట్టితో ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ వార్తలను వారు ఇన్నాళ్లు కన్ఫర్మ్ చేయలేదు.

ఇటీవల రాహుల్ పుట్టిన రోజు సందర్బంగా అతియా శెట్టి సోషల్ మీడియా పోస్ట్ మరియు నెట్టింట వైరల్ అయిన కొన్ని వీడియోలతో వారిద్దరి మద్య ఉన్న ప్రేమ వ్యవహారంను బట్ట బయలు చేశాయి. రాహుల్ మరియు అతియాల ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ స్టార్ నటుడు సునీల్ శెట్టి కూతురు అయిన అతియా శెట్టి అయిదు సంవత్సరాలుగా హీరోయిన్గా కొనసాగుతోంది. ఈమద్య కాలంలో ఈ అమ్మడికి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఈమె రాహుల్ తో ప్రేమలో ఉన్నట్లుగా వస్తున్న వార్తలు ఆమె కెరీర్ పై ప్రభావం చూపించే అవకాశం ఉందా అంటూ నెట్టింట కామెంట్స్ వినిపిస్తున్నాయి.