శోభన్ బాబు ఏమనుకున్నాడో అదే జరిగింది!

0

కమెడియన్ అలీ తనకు శోభన్ బాబుతో ఉన్న అనుబంధంను ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆ సందర్బంగా అలీ మాట్లాడుతూ.. శోభన్ బాబు గారు నటించిన ఒక సినిమాలో బాల నటుడిగా నటించాను. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆయన నటించిన సినిమాలో నేను కూడా ఒక హీరోగా చేశాను. షూటంగ్ మొదటి రోజు ఏం హీరో అంటూ పిలిచారు. ఆ సమయంలో నాకు చాలా ఇబ్బందిగా అనిపించి మీరు అలా అనకండి. మీ ముందు నేను హీరో ఎలా అంటూ కాస్త మొహమాట పడ్డాను. ఎంతో మంది కోరుకుంటే ఎవరికో ఈ అవకాశం వస్తుంది. అలాంటిది నీకు ఈ అవకాశం వచ్చింది అంటూ నాలో విశ్వాసం కలిగించారు.

షూటింగ్ సమయంలో నాకు చాలా నేర్పించారు. ఎన్టీఆర్.. ఏయన్నార్ వంటి స్టార్స్ ను చూసిన సమయంలో వారిలా నేను చేయాలనుకున్నాను. ఆ తర్వాత వారితో సమానంగా నటించగలిగాను. నువ్వు కూడా ఎలాంటి ఆందోళన లేకుండా చేయమంటూ ధైర్యం చెప్పారు. దాంతో నేను ఆ సినిమాలో నటించాను. ఆ తర్వాత కూడా ఆయన తో పలు సందర్బాల్లో కలిశాను. ఆయన చివరి దశలో కనీసం బయటకు కూడా వెళ్లలేదు.

ఆయన ఒక అందగాడిగా మాత్రమే జనాల మనసుల్లో ఉండాలనుకున్నారు. ఆయన ఏమైతే అనుకున్నారో అదే విధంగా జరిగింది. ఆయన మృతి చెందిన సమయంలో ఆయన ఎలా ఉన్నారు అనే విషయం కూడా తెలియకుండా చాలా మంది ఆయన్ను ఒక అందగాడిగానే ఊహించుకుంటారు. అది చాలా గొప్ప విషయం కదా అంటూ శోభన్ బాబు గొప్పతనంను తెలియజేశారు.