పూజా హెగ్డే మళ్లీ బుక్కయ్యింది

0

టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు దక్కించుకున్న ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ఈ అమ్మడు రాధేశ్యామ్ సినిమాతో పాటు అఖిల్ మూవీ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ లో నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ రెండు సినిమాలు కూడా వచ్చ ఏడాది బాక్సాఫీస్ ముందుకు రానున్నాయి. మరికొన్ని సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నాయి. ఈ సమయంలోనే ఈమె చేస్తున్న వరుస వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. ఆమె ఏ ఉద్దేశ్యంతో మాట్లాడుతుందో కాని జనాలు మరో ఉద్దేశ్యంతో ఆలోచిస్తున్నారో ఏమో కాని పూజా హెగ్డే వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి.

ఇటీవల తెలుగు ప్రేక్షకులకు థైస్ మరియు బొడ్డు అందం చూపిస్తే చాలు పెద్దగా నటించనక్కర్లేదు. వారు ఆధరిస్తారు అంటూ వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలు వివాదాస్పదం అవ్వడంతో వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఎన్టీఆర్ గురించి ఈమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఎన్టీఆర్ మరియు నా ఎనర్జి లెవల్స్ సేమ్ ఉండటంతో అరవింద సమేత సినిమాలో మా ఇద్దరి మద్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

ఈమెకు టాలీవుడ్ లో క్రేజ్ తీసుకు వచ్చిన సినిమా ‘డీజే’ అనేడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ సినిమాలో బన్నీ మరియు పూజా హెగ్డే జోడీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాంటి బన్నీతో స్ర్కీన్ షేర్ చేసుకుని మంచి పేరు దక్కించుకున్న పూజా హెగ్డే ఇప్పుడు కేవలం ఎన్టీఆర్ పేరును మాత్రమే చెప్పడం అది కూడా తనకు నచ్చిన హీరో అంటే ఎన్టీఆర్ పేరు చెప్పడం ఆమె అహంకార పూరిత దోరణికి అద్దం పడుతుంది అంటూ తీవ్ర స్థాయిలో మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా పూజా హెగ్డేను ట్రోల్ చేస్తున్నారు.