బ్లాక్ లోనూ మెరిసిపోతోంది

0

నవదీప్ హీరోగా నటించిన ‘మొదటి సినిమా’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ పూనంభజ్వా. మొదటి సినిమా నిరాశ పర్చినా కూడా తెలుగులో వరుసగా సినిమాలు చేసింది. ఆ తర్వాత తమిళం మరియు మలయాళంలో కూడా ఈ అమ్మడు నటించి మెప్పించింది. మలయాళం మరియు తమిళంలో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు దక్కించుకున్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో రెగ్యులర్ గా తన ఫొటో షూట్స్ ను షేర్ చేస్తూనే ఉంటుంది. తన ఫొటోలతో ఎప్పుడు కూడా ఫాలోవర్స్ కు టచ్ లో ఉంటున్న పూనం భజ్వా తాజాగా ఈ ఫొటోలను షేర్ చేసింది.

ఫుల్లీ బ్లాక్ డ్రస్ లో ఈ అమ్మడు ఆకట్టుకుంటుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సింపుల్ డ్రస్ లో లైట్ షో తో సిగ్గు పడుతూ ఉన్న పూనం భజ్వాను చూస్తుంటే వావ్ అనిపించక మానదు. ఈ అమ్మడు తెలుగులో మళ్లీ హీరోయిన్ గా ఆఫర్లు దక్కించుకునేంత గ్లామర్ తో ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈమె మొదటి సినిమా విడుదల అయ్యి 15 ఏళ్లు అయ్యింది. అయినా ఇప్పటికి కూడా అందాల విషయంలో ఏమాత్రం తేడా లేకుండా తగ్గకుండా కనిపించడం అంటే చాలా పెద్ద విషయం అంటూ నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.