టీవీ నటి ఆత్మహత్య వెనుక అతడి వేధింపులు!

0

షాకింగ్ గా మారిన మనసు మమత సీరియల్ నటి శ్రావణి సూసైడ్ వెనుక కారణం ఏమిటన్న అంశంపై కొత్త విషయం బయటకు వచ్చింది. మంగళవారం రాత్రి వేళలో తన ఇంట్లోని బాత్రూంలో సూసైడ్ చేసుకోవటాని కారణం ఒక వ్యక్తి వేధింపులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. కాకినాడ గొల్లప్రోలుకు చెందిన దేవరాజు రెడ్డితో శ్రావణికి టిక్ టాక్ ద్వారా పరిచయమైంది. తక్కువ వ్యవధిలోనే వారి మధ్య స్నేహం పెరిగింది.

స్నేహంగా ఉన్న సమయంలో సన్నిహితంగా దిగిన ఫోటోల్ని చూపిస్తూ వేధింపులకు దిగినట్లుగా బంధువులు ఆరోపిస్తున్నారు. ఆ ఫోటోల్ని బయటపెడతానంటూ బెదిరిస్తున్నాడని తెలుస్తోంది. వీటిని భరించలేక ఎస్ ఆర్ నగర్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం. అయినప్పటికీ అతడి నుంచి వేధింపులు ఆగకపోవటంతో విసిగిపోయినట్లు చెబుతున్నారు.

ఇటీవల కాలంలో అతడి వేధింపులు మరింత పెరిగినట్లుగా తెలుస్తోంది. వీటిని భరించలేకనే.. శ్రావణి సూసైడ్ చేసుకున్నట్లుగా ఆరోపిస్తున్నారు. శ్రావణి తండ్రి ఎస్ ఆర్ నగర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో.. తన కుమార్తె మరణానికి దేవరాజు రెడ్డి వేధింపులే కారణంగా పేర్కొనటం గమనార్హం. శ్రావణి మరణానికి కారణమైన దేవరాజును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. వేధింపుల ఫిర్యాదుపై ఎస్ఆర్ నగర్ పోలీసుల తీరు ఇప్పుడు కొత్త చర్చకు తెర తీసినట్లైంది.