ఆదిపురుష్ గూగుల్లో అలా దూసుకెళుతున్నాడు

0

సౌత్ లో పాన్ ఇండియా స్టార్ డమ్ ని పరిచయం చేసింది సూపర్ స్టార్ రజనీకాంత్. ఆయనకు దేశ విదేశాల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆ తర్వాత కమల్ హాసన్ .. చిరంజీవి.. అజిత్.. విజయ్ లాంటి స్టార్ హీరోల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ .. సూపర్ స్టార్ మహేష్ లకు దేశ విదేశాల్లో అద్భుత ఫాలోయింగ్ ఉంది.

అయితే ఇటీవలి కాలంలో ఈ పేర్లేవీ పాన్ ఇండియా స్టార్ డమ్ విషయంలో తెరపైకి రావడం లేదు. బాహుబలి స్టార్ ఆగమనం తర్వాత ప్రతిసారీ ప్రభాస్ పేరే మార్మోగుతోంది. తాజాగా ప్రభాస్ నుంచి ‘ఆదిపురుష్’ ప్రకటన వెలువడ్డాక డై-హార్డ్ ఫ్యాన్స్ అస్సలు తట్టుకోలేకపోయారు. ఆ ఎగ్జయిట్ మెంట్ ని ట్వీట్ల రూపంలో చూపించారు. తాజాగా గూగుల్ లో ట్రెండ్ అవుతున్న ట్విట్టర్ పోకడలు పరిశీలిస్తే డార్లింగ్ ప్రభాస్ హవా ఏ రేంజులో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఆదిపురుష్ టైటిల్ 3.1 మిలియన్ ట్వీట్లతో ట్రెండ్ అవుతోంది.. ఇది ఇప్పటికే నంబర్ వన్ గా ఉన్న రాధేశ్యామ్ 6.1 మిలియన్ల రికార్డును అధిగమిస్తుందని అంచనా వేస్తున్నారు. కనీసం ఆ తర్వాతి స్థానంలో అయినా నిలిచే వీలుందని భావిస్తున్నారు. తొలి రెండు స్థానాల్ని ప్రభాస్ ఆక్రమించినా ఆ తర్వాత మహేష – పవన్ లాంటి స్టార్లు మూడు నాలుగు స్థానాల్లో నిలిచే వీలుంది.

ప్రభాస్ ‘రాధే శ్యామ్’ టైటిల్ 6.1 మీలియన్లతో ట్విట్టర్ లో దేశంలోనే నంబర్ వన్ టైటిల్ ట్రెండ్ గా నిలిచింది. తరువాత 4.4 మిలియన్లతో మహేష్ ‘సర్కారు వారి పాట’ .. 3.5 మిలియన్ లతో పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ టాప్ 5లో ఉన్నాయి. ‘ఆది పురుషష్’ టైటిల్ ట్రెండ్ 3.1 మిలియన్లతో నాల్గవ స్థానంలో నిలిచింది. ఇప్పటికీ శరవేగంగా ట్వీట్లు లైక్ లతో హోరెత్తుతోంది. ఇది కనీసం 5 మిలియన్ల రికార్డును అందుకోవడం ఖాయమని అంచనా వేస్తున్నారు.

ఏ ఇతర స్టార్ తో పోల్చినా ప్రభాస్ కి ఉన్న క్రేజు వేరే. పాన్ ఇండియా స్టార్ గా అసాధారణ పాపులారిటీ తెచ్చుకున్న ప్రభాస్ ప్రస్తుతం పాన్ వరల్డ్ స్టార్ గా నిరూపించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. దేశ విదేశాల్లో మరింతగా ఫాలోయింగ్ పెంచుకునే దిశగా కెరీర్ పరంగా తెలివైన ఎత్తుగడలతో దూసుకెళుతున్నారు. ప్రభాస్ తర్వాతే ఇంకెవరైనా అన్నంత రేంజు బాహుబలి సిరీస్ సహా సాహో ఇచ్చాయనే చెప్పాలి.