ఢిల్లీలో సినిమా స్క్రీనింగ్ ప్రారంభం .. !

0

Movie screening begins in Delhi

Movie screening begins in Delhi

కరోనా వైరస్ .. ఈ మహమ్మారి ప్రజల జీవనశైలిలో అనేక మార్పులకి శ్రీకారం చుట్టింది. కనీసం జీవితంలో అలాంటి మార్పులు ఎవ్వరు ఉహించి కూడా ఉండరు. కానీ ప్రస్తుతం మెల్లిమెల్లిగా వాటికీ అలవాటు పడుతున్నారు. ఇక ముఖ్యంగా వినోదం అందించే సినిమా లేక ఐదు నెలలు అవుతుంది. టీవీ ఓటిటి హోమ్ థియేటర్ ఇలా ఎన్ని ఉన్నా కూడా థియేటర్ ఫీలింగ్ వేరు. కానీ అది కుదరదు. కరోనా ఇంకా పూర్తిగా కంట్రోల్ కాకపోవడంతో థియేటర్స్ ఓపెన్ చేయడానికి కేంద్రం అనుమతి ఇవ్వలేదు. అసలు థియేటర్స్ తెరచినా కూడా గతంలో లాగా ..సినీ ప్రియులు థియేటర్స్ కి వెళ్తారో లేదో.

ఈ పరిస్థితిలో డ్రైవ్ ఇన్ సినిమాకి ఆదరణ బాగా పెరిగింది. ఇది ఢిల్లీలోని ఎన్ సీఆర్ లో ప్రారంభమైంది. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. కరోనా భయాల నేపధ్యంలో ప్రేక్షకులు తమ కారులో కూర్చుని పూర్తి భద్రతతో సినిమాలను వీక్షిస్తున్నారు. సినిమా చూడటానికి ఈ పద్ధతి ఇప్పటికే పలుచోట్ల ఉన్నప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ విధానానికి మరింత ఆదరణ పెరుగుతోంది. సినిమా చూడాలనుకునే వారు కారులోనే కూర్చొని దర్జాగా చూసేయవచ్చు. దీనికి జనం నుంచి మంచి ఆధరణ లభించింది. ఈ పరిస్థితుల్లో ఈ ‘డ్రైవ్ ఇన్ సినిమా’ను జనాలు ఎంజాయ్ చేస్తున్నారు.

1970 వ దశకంలో అహ్మదాబాద్ ముంబైలలో డ్రైవ్ ఇన్ సినిమాలు ఏర్పాటైనా కొద్ది రోజుల్లోనే వాటిని మూసివేయాల్సివచ్చింది. దేశంలో ప్రస్తుతం ఆరు డ్రైవ్ ఇన్ సినిమాస్ ఉన్నాయి. వాటిలో రెండు గురుగ్రామ్ లో ఉన్నాయి. గురుగ్రామ్లోని డ్రైవ్ ఇన్ థియేటర్ సన్ సెట్ సినిమా క్లబ్ లో లాక్ డౌన్ తర్వాత మొదటి స్క్రీనింగ్ ను నిర్వహించారు. ఈ నెల 2223 తేదీల్లో కూడా సినిమాలు వేస్తామని చెప్పింది. ఇదే డిమాండ్ కొనసాగితే సెప్టెంబర్ నుంచి ప్రతి వారం సినిమా ప్రదర్శన చేస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. మొత్తానికి ఎప్పుడో మూతపడిన ఈ తరహా థియేటర్లు లాక్డౌన్ పుణ్యమా అని ఇప్పుడు అందుబాటులోకి రావడం అందరిని ఆకట్టుకుంటోంది.

ఈ సందర్భంగా సన్ సెట్ సినిమా క్లబ్ ప్రతినిధి సాహిల్ కపూర్ మాట్లాడుతూ ఇలాంటి కాన్సెప్ట్ ద్వారా సినిమాలను సురక్షితంగా చూడవచ్చన్నారు. ఆడియో నేరుగా కారులోకి చేరుకుంటుందని వీడియో 30 అడుగుల వెడల్పు గల సినిమా తెరపై కనిపిస్తుందని తెలిపారు. ప్రేక్షకుల డిమాండ్ ను అనుసరించి సెప్టెంబర్ నుంచి ప్రతి వారాంతంలో స్క్రీనింగ్ చేసే విషయమై థియేటర్ యాజమాన్యం పరిశీలిస్తోందన్నారు.