Templates by BIGtheme NET
Home >> Cinema News >> అడ్వాన్స్ లు తిరిగి ఇచ్చేస్తున్న ప్రభాస్?

అడ్వాన్స్ లు తిరిగి ఇచ్చేస్తున్న ప్రభాస్?


ప్రస్తుతం ప్రభాస్ ఆల్ ఇండియా స్టార్ అనడంలో సందేహం లేదు. విదేశాల్లో కూడా ప్రభాస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఏషియాలో అత్యధిక ఆధరణ ఉన్న సెల్రబెటీల జాబితాలో 7వ స్థానంలో ప్రభాస్ నిలిచాడు. అంతటి స్టార్ డమ్ ను దక్కించుకున్న ప్రభాస్ ఇంకా తెలుగు సినిమాల్లో నటిస్తే ఆయన అభిమానులు ఊరుకుంటారా. అందుకే వరుసగా బాలీవుడ్ సినిమాలను చేస్తున్నాడు. బాహుబలి.. సాహో సమయంలో ప్రభాస్ ఒక్కరు ఇద్దరు టాలీవుడ్ నిర్మాతలకు ఓకే చెప్పాడు అంటూ వార్తలు వచ్చాయి. ముఖ్యంగా దిల్ రాజుకు మరియు మైత్రి మూవీస్ వారికి ప్రభాస్ సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు అంటూ గతంలో వార్తలు వచ్చాయి.

సాహో పూర్తి అయ్యింది.. రాధేశ్యామ్ కూడా ముగియబోతుంది. ఈ సమయంలో ప్రభాస్ వరుగా బాలీవుడ్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ లకు ఓకే చెబుతున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమాను మాత్రం తెలుగు నిర్మాత అశ్వినీదత్ నిర్మిస్తున్నాడు. ఆ తర్వాత రెండు సినిమాలు ఒకటి బాలీవుడ్ నిర్మాణ సంస్థ మరియు మరోటి కన్నడ సినిమా నిర్మాణ సంస్థ. హంబుల్ మరియు బాలీవుడ్ నిర్మాణ సంస్థ కలిసి సలార్ నిర్మిస్తున్నారు. మూడు నాలుగు సంవత్సరాల క్రితం తెలుగు నిర్మాతల వద్ద తీసుకున్న అడ్వాన్స్ ను ప్రభాస్ వెనక్కు ఇచ్చేస్తున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. ముందు ముందు అయినా వారికి ప్రభాస్ డేట్లు ఇస్తాడా లేదా చూడాలి.