మనదేశంలో బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్…!

0

‘బాహుబలి’ సిరీస్ తో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. భారతీయ సినీ చరిత్రలో ‘బాహుబలి’ నిలిచిపోతే.. ప్రభాస్ మాత్రం ఈ సినిమాతో తన రేంజ్ ను పెంచుకున్నాడు. ఈ క్రమంలో డార్లింగ్ ఆ ఇమేజ్ ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఆ తర్వాత నటించిన ‘సాహో’ మూవీని కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేశాడు. రిజల్ట్ తో సంబంధం లేకుండా మరోసారి ప్రభాస్ రేంజ్ ఏంటో ఈ సినిమా బాక్సాఫీస్ కి చూపించింది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ‘రాధే శ్యామ్’.. నాగ్ అశ్విన్ తో చేయబోయే సినిమాలు కూడా పాన్ ఇండియా రేంజ్ లో రానున్నాయి. ఈ క్రమంలో లేటెస్టుగా డైరెక్ట్ గా బాలీవుడ్ సినిమా ‘ఆదిపురుష్’ ని అనౌన్స్ చేసి తన రేంజ్ ఏంటో చూపించడానికి రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు యావత్ భారతదేశ సినీ అభిమానులందరూ ప్రభాస్ గురించే మాట్లాడుకునేలా చేశాడు.

కాగా పలు భారతీయ భాషల్లో తెరకెక్కనున్న ‘ఆదిపురుష్’ చిత్రానికి ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించనున్నారు. ‘తానాజీ’ వంటి బ్లాక్ బస్టర్ ని అందించిన ఓం రౌత్ ఈసారి బాలీవుడ్ హీరోతో కాకుండా సౌత్ హీరోని ఎంచుకున్నాడంటేనే ప్రభాస్ క్రేజ్ ని అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో తాజాగా ఓం రౌత్ ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. ”మన దేశంలో అతిపెద్ద స్టార్ ప్రభాస్. సినిమాకి కమర్షియల్ వాల్యూ తీసుకొచ్చాడు. అతను కామ్ నెస్ మరియు దూకుడుతనం కలబోసిన పర్సన్. ప్రభాస్ తన పాత్ర కోసం ఇప్పటికే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడు” అని చెప్పుకొచ్చాడు. ఇక ‘ఆదిపురుష్’ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రారంభించి 2022లో విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ‘రాధే శ్యామ్’ షూటింగ్ కూడా పరిస్థితులు అనుకూలించిన వెంటనే స్టార్ట్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది.