Templates by BIGtheme NET
Home >> Cinema News >> ‘డార్లింగ్’ ప్లానింగ్ మాములుగా లేదుగా…!

‘డార్లింగ్’ ప్లానింగ్ మాములుగా లేదుగా…!


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘బాహుబలి’ సినిమా కోసం ఐదేళ్లు కేటాయించిన ప్రభాస్ కష్టం వృధా కాలేదు. ఒక్క సినిమాతో టాలీవుడ్ స్టార్ హీరో కాస్తా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అయితే ప్రభాస్ ఇప్పుడు ‘బాహుబలి’ సినిమా వల్ల వచ్చిన ఇమేజ్ ని కాపాడుకోవడానికి పక్కా ప్లాన్ తో వెళ్తున్నాడు. ఈ క్రమంలో ముందుగా ‘సాహో’ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఈ మూవీ తెలుగులో మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ బాలీవుడ్ లో మాత్రం సూపర్ సక్సెస్ అయింది. అందుకే ఇప్పుడు ప్రభాస్ తన మార్కెట్ ని అదే లెవల్ లో మైంటైన్ చేసేలా ప్రణాళిక రూపొందించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లాడు. ఈ మూవీని కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా నిలపడం కోసం టీ – సిరీస్ వారితో కలిసాడు ప్రభాస్. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ‘రాధే శ్యామ్’ కి కరోనా బ్రేక్స్ వేసింది. దీంతో ఐదు నెలలుగా చిత్రీకరణ స్టార్ట్ చేయలేకపోయారు.

అయితే డార్లింగ్ ప్రభాస్ మాత్రం అనుకోకుండా వచ్చిన ఈ హాలిడేస్ ని వృధా చేయలేదు. ఓ పక్క ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూనే మరో పక్క కొత్త కథలను వింటూ వచ్చాడు. ఈ క్రమంలో తన పాన్ ఇండియా ఇమేజ్ కి సూట్ అయ్యే స్టోరీలను సెలెక్ట్ చేసుకుంటూ వచ్చారు. ముందుగా ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ చెప్పిన సైన్స్ ఫిక్షనల్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకుణేని జోడీగా సెలెక్ట్ చేసుకున్నాడు. ప్రభాస్ కెరీర్లో 21వ చిత్రంగా రానున్న ఈ సినిమాని అంతర్జాతీయ స్థాయిలో విదేశీ భాషల్లో కూడా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇదే క్రమంలో లేటెస్టుగా ”ఆది పురుష్’ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నాడు. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ భూషణ్కుమార్ – క్రిషన్ కుమార్ నిర్మించనున్నారు. తెలుగు – హిందీ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని త్రీడీలో తెరకెక్కిస్తుండటం విశేషం. అంతేకాకుండా ఈ చిత్రాన్ని ప్రభాస్ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని తమిళ మలయాళ కన్నడ భాషలతో పాటు ఇతర విదేశీ భాషల్లోనూ డబ్బింగ్ చేయనున్నారు. ఇలా వరుసగా ప్రభాస్ తన ఇమేజ్ ని మరో లెవల్ కి తీసుకెళ్లే స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటూ పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నాడు.