Templates by BIGtheme NET
Home >> Cinema News >> జిమ్ లో ప్రగ్యా జ్వలనం

జిమ్ లో ప్రగ్యా జ్వలనం


ఫిజికల్ ఫిట్ నెస్ విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేయని కథానాయికల్లో ముంబై బ్యూటీ ప్రగ్య జైశ్వాల్ పేరు ముందు వరుసలో ఉంటుంది. ఈ అమ్మడు నిరంతరం జిమ్… యోగా సెషన్స్ కి సంబంధించిన ఫోటోలు.. వీడియోల్ని షేర్ చేస్తూ యువతరానికి టచ్ లోనే ఉంటుంది.

ముఖ్యంగా ఇన్ స్టాలో టైట్ ఫిట్ స్పోర్ట్ లుక్ తో ఆవిరులు పుట్టించడం ఈ అమ్మడి ప్రత్యేకత. కంచె లాంటి హిట్ సినిమాలో నటించినా.. ఆ తర్వాత టాలీవుడ్ లో చెప్పుకోదగ్గ ఆఫర్ కోసం చాలానే శ్రమించింది. అడపాదడపా ఫ్లాప్ హీరోలు అవకాశాలిచ్చారే కానీ స్టార్ డమ్ ఉన్న హీరో ఎవరూ అవకాశం ఇవ్వకపోవడం కెరీర్ కి మైనస్ అయ్యింది. అయినా పట్టువదలక తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉంది.

ఆ క్రమంలోనే సోషల్ మీడియాల్లో తనకు ఫాలోయింగ్ తగ్గకుండా జాగ్రత్త పడుతోంది. నిరంతరం శ్రమిస్తూ టోన్డ్ బాడీతో ఫిలింమేకర్స్ కి ఫీలర్స్ వదులుతూ టచ్ లో ఉంది. తాజాగా జిమ్ లో డంబెల్స్ ఎత్తి తీవ్రంగా శ్రమిస్తున్న వీడియోని ప్రగ్య షేర్ చేసింది. వైట్ ఆడిడాస్ స్పోర్ట్ టాప్.. బ్లాక్ ట్రాక్ లో ప్రగ్య పర్ఫెక్ట్ టోన్డ్ బాడీతో మురిపిస్తోంది. ఇటీవల టాలీవుడ్ నుంచి ఓ నిర్మాత అమ్మడికి ఫోన్ టచ్ లోకి వెళ్లాడట. బహుశా ఆ ప్రాజెక్ట్ గురించి తొందర్లోనే అధికారికంగా ప్రకటిస్తుందేమో చూడాలి. అంతవరకూ ప్రగ్య జ్వలనం రాకెట్ స్పీడ్ తో ఇంటర్నెట్ లో దూసుకుపోతుందనడంలో సందేహమేం లేదు.

Not gonna lie, I really miss going to the gym ! 💪🏻💪🏻 #MondayMotivation

null