Templates by BIGtheme NET
Home >> Cinema News >> క్రాక్’ దర్శకుడితో పవర్ స్టార్ సినిమా..?

క్రాక్’ దర్శకుడితో పవర్ స్టార్ సినిమా..?


Gopichand Malineni Planning a movie with pawan kalyan

Gopichand Malineni Planning a movie with pawan kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. వకీల్ సాబ్ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి మళ్లీ రీఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న వకీల్ సాబ్ సినిమాకు మరో చిన్న షెడ్యూల్ మిగిలి ఉన్నట్లు తెలుస్తుంది. త్వరలోనే షూటింగ్ కంప్లీట్ చేద్దాం అనుకునేలోపు కరోనా మహమ్మారి వ్యాప్తి చెంది బ్రేక్ వేసింది. అందుకే షూటింగ్స్ ఆపేసి ఎక్కడివారక్కడే ఇళ్లకు అంకితమయ్యారు. పవర్ స్టార్ కూడా వకీల్ సాబ్ షూటింగులో ఉండగానే మరి కొన్ని ప్రాజెక్టులను లైన్లో పెట్టారు. ఇదిలా ఉండగా కరోనా భయంతో షూటింగ్స్ నిలిచిపోవడం వలన వకీల్ సాబ్ చిత్రబృందం అంతా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించిందట. ప్రస్తుతం వరుసగా మూడు ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసి ఫ్యాన్స్ ఆనందాన్ని రెట్టింపు చేశారు పవన్. ఆయన నుండి మొదటగా వకీల్ సాబ్ విడుదల కానుంది. అలాగే డైరెక్టర్ క్రిష్ తో చేస్తున్న పీరియాడిక్ మూవీ ‘విరూపాక్ష’ వచ్చే ఏడాది విడుదల కానుందట.

ఇక గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ అందించిన డైరెక్టర్ హరీష్ శంకర్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హరీష్ శంకర్ తర్వాత పవన్ కళ్యాణ్ చేయబోయే 29వ సినిమా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇప్పటికే దర్శక నిర్మాతలు చాలా మంది పవన్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారట. ఇక పవన్ 29వ సినిమాను డైరెక్ట్ చేయడానికి డైరెక్టర్ బాబీ డాలీ లైన్లో ఉన్నట్లు వార్తలొచ్చాయి. ఇదిలా ఉండగా.. తాజా సమాచారం ప్రకారం.. పవర్ స్టార్ ను డైరెక్ట్ చేయబోయే అవకాశం బలుపు ఫేమ్ గోపీచంద్ మలినేని దక్కించుకున్నట్లు సినీవర్గాలలో టాక్. ఇక గోపీచంద్ స్క్రిప్ట్ వర్క్ కూడా స్టార్ట్ చేసాడని అంటున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మాస్ రాజా రవితేజ హీరోగా క్రాక్ సినిమా చేస్తున్నాడు. రవితేజ-గోపీచంద్ కాంబినేషన్లో హ్యాట్రిక్ సినిమాగా రాబోతున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయినుగా నటిస్తుంది. చూడాలి మరి పవన్ – గోపీచంద్ కాంబినేషన్ పై అధికారిక ప్రకటన రానుందేమో..!!