Templates by BIGtheme NET
Home >> Cinema News >> Trisha Deleted Her Insta Posts

Trisha Deleted Her Insta Posts


Trisha Deleted Her Insta Posts

Trisha Deleted Her Insta Posts

గుండు సూది కింద పడినా సోషల్ మీడియాలో వార్తనే. ఏ మూల ఎలాంటి అలజడి చెలరేగినా అది మారుమూల ప్రాంతాలకు ఈ వేదికపై తెలిసిపోతోంది. అలాంటిదే ఒకటి తెలిసిపోయింది. అదేమిటి? అంటే.. క్యూట్ త్రిష ఇన్ స్టా పేజీ నుంచి 100 ఫోటోలు.. ఏడు పోస్టులు మిస్సయ్యాయి. అసలు అలా ఎందుకు జరిగింది? అన్నదే సోషల్ మీడియా డిబేట్.

ఉన్నట్టుండి త్రిష అలా ఎందుకు చేసింది? అంటే ఇన్ స్టాలో ఏదో కొత్తగా చెప్పబోతోందట. షల్ మీడియాను క్లీన్ చేయడం అనేది ఖచ్చితంగా ఏదో ఒక సంకేతం. అదేమిటి? అన్నది సందిగ్ధంగా మారింది. ఇక క్లియర్ చేసిన వాటిలో `ఆచార్య` కు సంబంధించిన పోస్టింగ్ కూడా మిస్సయ్యింది. ఇక త్రిష మెగాస్టార్ సినిమాకి కమిటై ఆ తర్వాత రకరకాల కారణాలతో మాట మార్చిన సంగతి తెలిసిందే. అసలేం జరుగుతోంది అన్నది ఇప్పటికైతే సస్పెన్స్.

కొందరైతే ఈ అమ్మడు త్వరలోనే పెళ్లాడేయబోతోందని .. ఆ సీక్రెట్ మ్యాన్ ఎవరో ఇకపై తెలుస్తుందని గుసగుసలాడేస్తున్నారు. తనకు ఎంతో సన్నిహితుడైన ఒక హీరోని పెళ్లాడేయబోతోందని గెస్ చేస్తున్నారు మరికొందరు. అందుకే ముందుగా ఈ పోస్టులన్నిటినీ క్లియర్ చేసుకుందని ఇకపై ఇక్కడ కొత్త విషయాలు చెబుతుందని భావిస్తున్నారు. త్రిషకు ఇన్ స్టాలో 2.4 మిలియన్ల మంది .. ట్విట్టర్లో 5.4 మిలియన్ల మంది అభిమానులు ఉన్నారు. వీళ్లంతా తాజా ఘటనతో కలత చెందారు. ఒక మంచి శుభవార్తతో అన్నికలతలకు చెక్ పెట్టేస్తుందేమో చూడాలి.