కరోనా టైమ్ లోనూ రష్మిక డిమాండ్ తో ఆఫర్లు తగ్గాయా?

0

Rashmika Demands Huge Remunaration

Rashmika Demands Huge Remuneration

టాలీవుడ్ లో ప్రస్తుతం రష్మిక మందన్న టైం నడుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ ఏడాదిలో సరిలేరు నీకెవ్వరు మరియు భీష్మ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ దక్కించుకున్న ఏకైక హీరోయిన్. ఈ ఏడాదిలో హీరోయిన్స్ సినిమాలు రావడమే కష్టం అయ్యింది. కాని రష్మిక మాత్రం ఈ ఏడాది ఆరంభంలోనే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఆ సినిమాలతో సక్సెస్ దక్కించుకోవడం వల్ల ఈమె క్రేజ్ బాగా పెరిగింది. కరోనా కారణంగా చాలా మంది నిర్మాతలు కాస్ట్ కట్టింగ్ అంటున్నారు.

హీరోలు హీరోయిన్స్ దర్శకులు ఇలా అందరు టెక్నీషియన్స్ కూడా కరోనా కారణంగా పారితోషికం తగ్గించుకోవాల్సిందే అంటూ నిర్మాతలు విజ్ఞప్తి చేస్తున్నారు. అలా తగ్గించుకుంటే తప్ప సినిమాలను నిర్మించలేం అంటున్నారు. ఇలాంటి సమయంలో రష్మిక మాత్రం తన పారితోషికం విషయంలో తగ్గేది లేదంటోంది. ఈ ఏడాది రెండు సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో పారితోషికంను ఇంకా పెంచింది.

ఇటీవల ఒక నిర్మాత ఆమెను సినిమా కోసం సంప్రదించగా ఆమె చెప్పిన పారితోషికం షాక్ ఇచ్చేలా ఉందట. కరోనా టైంలో ఇంత పారితోషికం ఏంటండీ అంటూ ప్రశ్నించగా ఆమె తన క్రేజ్ కు తగ్గట్లుగానే పారితోషికం చెప్పాను. అంతకు తగ్గేది లేదు అంటూ నిర్మొహమాటంగా చెప్పేసిందట. దాంతో ఆ నిర్మాత మరో హీరోయిన్ తో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.