Templates by BIGtheme NET
Home >> Cinema News >> టాలీవుడ్ సెలబ్రిటీలు @DR50 సెలబ్రేషన్స్..!

టాలీవుడ్ సెలబ్రిటీలు @DR50 సెలబ్రేషన్స్..!


టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ లలో దిల్ రాజు ఒకరు. డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన వెంకట రమణారెడ్డి ఆ తర్వాత రోజుల్లో ప్రొడ్యూసర్ గా మారి అభిరుచి గల నిర్మాత అనిపించుకున్నారు. ‘దిల్’ సినిమాతో దిల్ రాజుగా మారిపోయిన ఆయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వరుస విజయాలను అందుకుంటూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా దూసుకుపోతున్నారు. ఇటీవల రెండో వివాహం చేసుకుని జీవితంలో కూడా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసాడు. అయితే నేటితో దిల్ రాజు 50 ఏళ్ళ మైలురాయిని చేరుకున్నారు. తన 50వ పుట్టినరోజు సందర్భంగా ఆయన కుమార్తె హన్షితా రెడ్డి టాలీవుడ్ సినీ ప్రముఖులకు గ్రాండ్ పార్టీ ప్లాన్ చేశారు. ‘దిల్ రాజు@50ఇయర్స్’ అనే పేరుతో నిర్వహించిన ఈ పార్టీలో స్టార్స్ అందరూ సందడి చేశారు. దిల్ రాజు పుట్టినరోజు వేడుకలకి దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోలు అంతా హాజరైనట్లు తెలుస్తోంది. ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి.

మెగా స్టార్ చిరంజీవి – సూపర్ స్టార్ మహేష్ బాబు – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సెలబ్రేషన్స్ కి అటెండ్ అయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు ఒకే ఫ్రేమ్ లో కలిసి ఉన్న ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అలానే స్టార్ కపుల్ అక్కినేని నాగచైతన్య – సమంత కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ‘కేజీఎఫ్’ దర్శక హీరోలు ప్రశాంత్ నీల్ మరియు రాకింగ్ స్టార్ యష్ కూడా ఈ పార్టీకి అటెండ్ అయ్యారు. వీరితో పాటు విజయ్ దేవరకొండ – విశ్వక్ సేన్ – పూజాహెగ్డే – రాశీఖన్నా తదితరులు సందడి చేశారు. లాక్ డౌన్ కాలంలో సింపుల్ గా సెకండ్ మ్యారేజ్ చేసుకున్న దిల్ రాజు ఈ బర్త్ డే సెలబ్రేషన్స్ లో తన సతీమణిని అందరికీ ఫార్మల్ గా పరిచయం చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ట్రెండీ అవుట్ ఫిట్స్ లో ఉన్న దిల్ రాజు దంపతులు పార్టీకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో దిల్ రాజు బర్త్ డే వేడుకలకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.