‘పుష్ప’ షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్..!

0

అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ”పుష్ప”. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందే ఈ చిత్రంలో లారీ డ్రైవర్ పుష్పరాజ్ గా బన్నీ నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ – టీజర్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తోంది.

‘పుష్ప’ లో విలన్ గా నటిస్తున్న ఫహాద్ ఫాజిల్ పై ఇటీవల కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారట. అలానే ఇందులో కీ రోల్ ప్లే చేస్తున్న యాంకర్ అనసూయ పై కూడా కొన్ని సీన్స్ షూట్ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో సీనియర్ నటులు ప్రకాష్ రాజ్ – జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మిరోస్లా కుబా బ్రోజెక్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ‘పుష్ప’ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ – ముత్యంశెట్టి మీడియా సంస్థలు కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ‘ఆర్య’ ‘ఆర్య 2’ చిత్రాల తర్వాత సుక్కూ – బన్నీ కాంబోలో భారీ అంచనాలతో వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీ ఎలాంటి రికార్డులు తిరగరాస్తుందో చూడాలి.