మల్టీ ట్యాలెంటెడ్ హీరోయిన్ మరో వీడియో

0

Raashi Khanna Showed Her Guitar And Singing Talent

Raashi Khanna Showed Her Guitar And Singing Talent

హీరోయిన్ రాశి ఖన్నా మల్టీట్యాలెంటెడ్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమయంలోనే డబ్బింగ్ చెప్పుకోవడంతో పాటు తెలుగు రాకున్నా తెలుగు పాటలు పాడిన ఘనత ఆమెకు దక్కుతుంది. కేవలం నటించడంకు మాత్రమే చాలా మంది హీరోయిన్స్ కు వస్తుంది. కాని రాశిఖన్నా మాత్రం చాలా విభిన్నం అంటూ తనకు తాను ఎప్పటి నుండో నిరూపించుకుంటూనే ఉంది. ఈ లాక్ డౌన్ టైంలో రాశిఖన్నా తనకు ఇష్టమైన పలు విద్యలను నేర్చుకుంది.

ఈమె నేర్చుకున్న గిటార్ విద్యను రెగ్యులర్ గా ఫాలోవర్స్ ముందు ప్రదర్శిస్తూనే ఉంది. ఆమద్య ఒక హిందీ పాటను తానే గిటార్ వాయిస్తూ పాడిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా ఈసారి తెలుగు పాటను పాడినది. హుషారు చిత్రంలోని ఉండిపోరాదే.. పాటను పాడి మెప్పించింది. తెలుగు లిరిక్స్ ను చాలా బాగా పలకడంతో పాటు గిటార్ ను పాటకు తగ్గట్లుగా వాయిస్తూ అద్బుతమైన వీడియోను చేసింది. ప్రస్తుతం ఉన్న తెలుగు హీరోయిన్స్ లో అతి తక్కువ మంది మాత్రమే ఇలా మల్టీ ట్యాలెంట్ ను కనబర్చుతూ ఉన్నారు.

రాశిఖన్నా అందంతో ఆకట్టుకోవడంతో పాటు నటిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు తన గొంతుతో మరియు గిటార్ వాయిద్యంతో మెప్పించడం నిజంగా అభినందనీయం. తెలుగులో ఈ అమ్మడు ఊహలు గుసగుసలాడే చిత్రంతో పరిచయం అయ్యి ఆ తర్వాత పలువురు స్టార్ హీరోలు చిన్న హీరోల సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుంది. ప్రస్తుతం తెలుగు మరియు తమిళంలో పలు చిత్రాల్లో నటించడంతో పాటు కొన్ని చర్చల దశలో ఉన్నాయి.

null

null