Templates by BIGtheme NET
Home >> Cinema News >> గులాబీ వనంలో వైల్డ్ ఫ్లవర్

గులాబీ వనంలో వైల్డ్ ఫ్లవర్


అందాల రాశీ ఖన్నా రెగ్యులర్ ఇన్ స్టా ట్రీట్ గురించి చెప్పాల్సిన పనే లేదు. నవతరంలో తనదైన జోరు చూపిస్తూ సోషల్ మీడియాల్లో లక్షలాదిగా ఫాలోవర్స్ ని పెంచుకోవడంలో రాశీ జరంత స్పీడ్ మీద ఉంది. ఇకపోతే రాశీఖన్నా లేటెస్ట్ ఫోటోషూట్ యువతరంలో వైరల్ గా మారింది. బంగారు వర్ణం డిజైనర్ శారీలో వీపందం ప్రదర్శిస్తూ రాశీ ఇచ్చిన ఫోజు కుర్రకారు గుండెల్ని చిద్రం చేస్తోంది. గులాబీ వనంలో వైల్డ్ ఫ్లవర్ ని అంటూ రాశీ ఇచ్చిన కొటేషన్ హీట్ పెంచుతోంది.
అయితే రాశీ వైల్డ్ ట్యాగ్ లైన్ కి తగ్గట్టే కుర్రకారు రెస్పాండ్ అవుతున్నారు.

“వీపు చూడు వీపందం చూడు.. కోక చూడు కోకందం చూడు!“ అంటూ కుర్రకారు ఒకటే పరేషాన్ అయిపోతున్నారు. అసలే పాల నురుగు అందం.. ఆపై బాగా స్లిమ్ అయ్యాక ఇలా వరుస ఫోటోషూట్లతో ఇస్తున్న ట్రీట్ బ్లాస్ట్ అవుతోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో కెరీర్ పరంగా ఆశించినంత జోరు లేదు. కొన్ని వరుస ఫ్లాపుల తర్వాత కోలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ లక్ చెక్ చేసుకునే ప్రయత్నంలో ఉంది. మరోసారి టాలీవుడ్ లో కంబ్యాక్ అదరగొడుతుందనే సంకేతాలు అందుతున్నాయి మరి.