తంబీల మత్తులో టాలీవుడ్ ని లైట్ తీస్కుందా?

0

టాలీవుడ్ లో ఆరేళ్లుగా కెరీర్ సాగిస్తోంది దిల్లీ బ్యూటీ రాశీ ఖన్నా. అగ్ర హీరోల సరసన అవకాశాలు రాకపోయినా మిడ్ రేంజ్ హీరోలు యంగ్ హీరోల సరసన వరుస ఆఫర్లు అందుకుంటోంది. అయితే ఇటీవల టాలీవుడ్ కెరీర్ సోసోగానే మారింది. వెంకీ మామ- వరల్డ్ ఫేమస్ లవర్ తర్వాత మరో క్రేజీ చిత్రానికి రాశీ సంతకం చేసింది లేదు.

ఆ క్రమంలోనే తమిళ పరిశ్రమలో మాత్రం రాశీ జోరు పెంచింది. అక్కడ ఒక్కొక్కటిగా క్రేజీ ఆఫర్లు అందుకుంటోంది. ఇప్పటికిప్పుడు తమిళంలో నాలుగైదు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు.

నేడు రాశీ పుట్టినరోజు సందర్భంగా తన క్రేజీ మూవీ వివరాలు వెల్లడయ్యాయి. రాశీ తాజాగా ఓ భారీ బడ్జెట్ ఎంటర్ టైనర్ కి సంతకం చేసింది. ఇందులో చియాన్ విక్రమ్ సరసన రాశీ నాయికగా నటిస్తుంది. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రానికి తమిళ స్టార్ డైరెక్టర్ హరి దర్శకత్వం వహించనున్నారు. సామి- సామి స్క్వేర్ తర్వాత ఈ కాంబోలో క్రేజీ మూవీ ఇది. రాశీ నటిస్తున్న తమిళ చిత్రాల్లో ఆరణ్మనై 3- తుగ్లక్ దర్బార్-మేధావి చిత్రీకరణలో ఉన్నాయి. సైతాన్ కా బచ్చా రిలీజ్ కి రావాల్సి ఉంది.