పా రంజిత్ బాక్సింగ్ డ్రామాకు ఫస్ట్ లుక్ రెడీ!

0

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కబాలి… కాలా వంటి చిత్రాల్ని అందించి ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన దర్శకుడు పా. రంజిత్. ఈ రెండు చిత్రాలు ఆశించిన విజయాల్ని సాధించలేకపోయినా దర్శకుడిగా పా. రంజిత్ కు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఈ రెండు చిత్రాల తరువాత పా. రంజిత్ ఓ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

స్లమ్ ఏరియా యువకుడు బాక్సర్ గా ఎదిగిన క్రమాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తూ పా. రంజిత్ ఓ స్పోర్ట్స్ డ్రామాని తెరకెక్కిస్తురు. ఇందులో హీరోగా ఆర్య నటిస్తున్నాడు. ఇందు కోసం బాడీ బిల్డ్ చేసి బాక్సర్ గా మారిపోయిన ఆర్య తన ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ని ఖరారు చేయలేదు. ఆర్య నటిస్తున్న 30వ చిత్రం కావడంతో `ఆర్య 30` అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది.

కాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని డిసెంబర్ 2న హీరో ఆర్య ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేయబోతున్నాడు. ఈ విషయాన్ని మండే వెల్లడించాడు. ఈ మూవీకి `సాల్పేట` అనే టైటిల్ ని పెట్టనున్నట్లు సమాచారం. ఫస్ట్ లుక్ పోస్టర్ విత్ టైటిల్ భారీ అంచనాల మధ్య విడుదలవుతున్నందున అందరి కళ్ళు ఇప్పుడు దీనిపైనే వున్నాయి. ప్రీ లుక్ ని షేర్ చేసిన ఆర్య `పడగొట్టడానికి సిద్ధంగా ఉండండి!.. 2.12.2020 న # ఆర్య 30 ఫస్ట్ లుక్ ` అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.