సినీ నటి, బీజేపీ లీడర్ మాధవీలతపై కేసు నమోదు

0

rachakonda cyber crime police filed case on actress bjp leader madhavi latha

rachakonda cyber crime police filed case on actress bjp leader madhavi latha

సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీలతపై రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫేస్‌బుక్‌లో హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా పోస్టు పెట్టారనే ఆరోపణతో ఈ కేసు నమోదైంది. హైదరాబాద్‌లోని వనస్థలిపురం ప్రాంతానికి చెందిన గోపీకృష్ణ అనే విద్యార్థి ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. 295-A సెక్షన్ కింద కేస్ నమోదు చేసినట్టు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు.

‘‘ITS A CHALLENGE
హిందూ ధర్మం దాని రక్షణ అని పిసుక్కునే ఫేస్‌బుక్ హిందూ ధర్మ రక్షకులకి, వీరాది వీరులకి, శూరులకి, దొంగ భక్తులకి నా విన్నపం. ఈ వీడియో మొత్తం చూసి హిందువుల మీద జరిగే దాడులు చేసేవాళ్ళని ప్రశ్నించి అడిగి కడిగి దులిపి తుడిచి లాగిపెట్టి కొట్టి, మీ దమ్ము చూపించి, మీ భక్తి చూపించి, మీ గుండె చూపించి తర్వాత వచ్చి నా చీర గురించి మాట్లాడండి. కాదు కూడదు నువ్వు ఆడపిల్లవి, అబలవి, చేతకానిదానివి, డబ్బులేని దానివి, పదవిలేని దానివి, రాజరిక కుటుంబ నేపథ్యం లేనిదానివి కనుక, బలహీనురాలివి కనుక, మా యొక్క జ్ఞానం లేని దొంగ హిందూ భక్తిని నీ మీద చూపిస్తాం అంటే చాలా సంతోషం.
May God Bless you
ఈనాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంతే వేరే మార్గము లేదంతే దైవం నీ పాపపు లెక్కలు రాస్తుంది, లెక్క తేల్చుతుంది కూడాను.
IF NOT PLEASE SHUT UR DILTHY MOUTHS AND STAY CALM’’ అని ఆగస్టు 14న మాధవీలత ఒక పోస్ట్ చేశారు. బహుశా దీనిపైనే ఇప్పుడు గోపీకృష్ణ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి ఉండొచ్చు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే, మాధవీలత చాలా కాలం తరవాత మళ్లీ వెండితెరపై కనిపించనున్నారు. మాధవీలత ఏకైక పాత్రతో ‘లేడీ’ అనే థ్రిల్లింగ్ ఎమోషనల్ డ్రామా రూపొందుతోంది. మాధవీలత సోలో పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టనున్నారు. జీఎస్ఎస్ఎస్‌పీ కళ్యాణ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మోనో ప్లే ఎక్సపెరిమెంటల్ మూవీని చరణ్స్ క్రియేషన్స్, జీఎస్ఎస్ఎస్‌పీకే స్టూడియోజ్ బ్యానర్లపై సత్యనారాయణ గొరిపర్తి, జీఎస్ఎస్ఎస్‌పీ కళ్యాణ్ నిర్మిస్తున్నారు.

ITS A CHALLENGE హిందూ దర్మం దాని రక్షణ అని పిసుక్కునే ఫేస్బుక్ హిందూ ధర్మ రక్షకులకి , వీరాది వీరులకి ,శూరులకి ,…

Posted by Actress Maadhavi on Friday, August 14, 2020