‘రాధేశ్యామ్’ టీజర్ కు ఏర్పాట్లు

0

మరో రెండు వారాల్లో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు రాబోతుంది. అక్టోబర్ 23న ఆయన పుట్టిన రోజు వేడుకను వైభవంగా జరుపుకునేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈమద్య కాలంలో సోషల్ మీడియా ట్రెండ్ లు.. రికార్డులు ఎక్కువ అవుతున్నాయి. హ్యాపీ బర్త్ డే హ్యాష్ ట్యాగ్స్ లను మిలియన్ ల కొద్ది ట్వీట్ చేయడం వల్ల ప్రపంచ రికార్డులను సైతం మన స్టార్ హీరోల ఫ్యాన్స్ దక్కించుకుంటున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ట్విట్టర్ రికార్డుపై కన్నేశారు. ఇక ఇదే సమయంలో ప్రభాస్ నటిస్తున్న నటించబోతున్న మూడు సినిమాలకు సంబంధించిన కీలక అప్ డేట్స్ లేదా సర్ ప్రైజింగ్ గిఫ్ట్ లను ప్రేక్షకులకు ఇచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.

ప్రభాస్ పుట్టిన రోజు సందర్బంగా రాధేశ్యామ్ సినిమా మోషన్ పోస్టర్ విడుదల అయ్యే అవకాశం ఉందని ఇన్ని రోజులు టాక్ వినిపించింది. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా టీజర్ ను ప్రభాస్ బర్త్ డే సందర్బంగా విడుదల చేయబోతున్నారట. ఇన్ని రోజులు టీజర్ కు సంబంధించిన షాట్స్ లేకపోవడం వల్ల టీజర్ విడుదల విషయంలో అనుమానాలు నెలకొన్నాయి. ఇటీవలే యూరప్ వెళ్లిన యూనిట్ సభ్యులు అక్కడ చిత్రీకరణ మొదలు పెట్టారు.

మొదట టీజర్ కోసం కొన్ని షాట్స్ ను చిత్రీకరించారట. దాంతో ప్రభాస్ పుట్టిన రోజుకు టీజర్ రాబోతున్నట్లుగా యూనిట్ సభ్యులు అనధికారికంగా చెబుతున్నారు. ఇప్పటికే టీజర్ కట్టింగ్ కు సంబంధించిన పనులు షురు అయ్యాయట. త్వరలోనే ఫైనల్ ఔట్ పుట్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ టీజర్ కోసం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇన్ని రోజులు రాధేశ్యామ్ అప్ డేట్ లేదు అంటూ విమర్శలు చేసిన అభిమానులు ఇప్పుడు టీజర్ వస్తున్న నేపథ్యంలో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.