వకీల్ సాబ్ లో ఆమె కూడా జాయిన్ అయ్యింది.. ఇక పవన్ దే ఆలస్యం

0

పవన్ 26వ సినిమా వకీల్ సాబ్ చిత్రీకరణ దాదాపు ఆరు నెలల తర్వాత ఇటీవలే షూటింగ్ పునః ప్రారంభం అయ్యింది. గత రెండు మూడు వారాలుగా షూటింగ్ జరుగుతున్నా పవన్ మాత్రం ఇప్పటి వరకు జాయిన్ అవ్వలేదు. పవన్ లేకుండా ఉన్న సీన్స్ ను దర్శకుడు చిత్రీకరిస్తున్నాడు. ముందుగా అనుకున్న ప్రకారం పవన్ వచ్చే నెలలో జాయిన్ అవ్వాల్సి ఉంది. కాని షూటింగ్ త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో ఈ నెలలోనే షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నాడట. ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటున్న వకీల్ సాబ్ సెట్ లో ట్యాలెంటెడ్ హీరోయిన్ నివేధా థామస్ కూడా జాయిన్ అయ్యింది. ఆమె పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట.

నివేధా థామస్ సోలో సీన్స్ చిత్రీకరణ పూర్తి అయ్యే సమయానికి పవన్ కూడా టీంతో జాయిన్ అవ్వబోతున్నాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయట. పవన్ ఎప్పుడు జాయినింగ్ అనే విషయంలో క్లారిటీ లేదు కాని అతి త్వరలో ఆయన వస్తాడంటూ యూనిట్ సభ్యులు వెయిట్ చేస్తున్నారట. పవన్ ఇటీవల కన్నడ నటుడు సుదీప్ ను కలిసిన విషయం తెల్సిందే. ఆ సమయంలో కూడా పవన్ గడ్డం మరియు జుట్టు అలాగే పెద్దగా ఉంది. అంటే ఆయన ఇంకా షూటింగ్ కు రెడీ అవ్వలేదా అంటూ ఫ్యాన్స్ నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

వకీల్ సాబ్ చిత్రీకరణ కోసం పవన్ మూడు వారాల పాటు డేట్లు ఇచ్చాడట. ఆ మూడు వారాల్లో పూర్తి చేసి విడుదలకు సిద్దం చేయబోతున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారు. ఈ సినిమాలో కీలక పాత్రకు గాను శృతి హాసన్ ను నటింపజేస్తున్న విషయం తెల్సిందే.