జక్కన్నతో కలిసి చిరునవ్వులు చిందిస్తున్న ‘కొమరం భీమ్’…!

0

దర్శకధీరుడు రాజమౌళి – యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక హీరో – దర్శకుడుకి మధ్య ఉండే అనుబంధం కంటే అంతకుమించిన స్నేహబంధం ఉందనుకునేలా మెలుగుతూ ఉంటారు. ‘స్టూడెంట్ నెంబర్ 1’ సినిమాతో మొదలైన వీరి సినీ ప్రయాణం.. ఇప్పుడు ‘ఆర్.ఆర్.ఆర్’ వరకు కొనసాగుతోంది. రాజమౌళిని ముద్దుగా ‘జక్కన్న’ అని పిలుస్తుంటారు తారక్. వీరి కాంబినేషన్ లో ఇప్పటి వరకు ‘స్టూడెంట్ నెంబర్ 1’ ‘సింహాద్రి’ ‘యమదొంగ’ వంటి హ్యాట్రిక్ హిట్ సినిమాలు తెరకెక్కాయి. ఇప్పుడు నాలుగో సినిమాగా ‘ఆర్.ఆర్.ఆర్’ రెడీ అవుతోంది. ఇది కూడా ఖచ్చితంగా హిట్ అవుతుందని సినీ అభిమానులు నమ్మకంతో ఉన్నారు. నేడు రాజమౌళి బర్త్ డే సందర్భంగా విషెష్ చెప్తూ తారక్ ఓ ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేశారు.

ఎన్టీఆర్ – రాజమౌళి కలిసి ఉన్న ఈ ఫోటో నెట్టింట హాల్ చల్ చేస్తోంది. ఫొటోలో ఇద్దరూ హుడీలు ధరించి ఒకరినొకరు చూసుకుంటూ చిరునవ్వులు చిందిస్తున్నారు. ఈ ఫోటో షూటింగ్ లొకేషన్స్ లో తీసినదిగా తెలుస్తోంది. ఇక కరోనా కారణంగా నిలిచిపోయిన షూటింగ్ ఏడు నెలల తర్వాత ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. ‘వియ్ ఆర్ ఆర్ ఆర్ బ్యాక్’ అంటూ షూటింగ్ విశేషాలను తెలియజేసారు. ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడంతో ఆర్.ఆర్.ఆర్ కోసం యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందులోనూ స్టార్ హీరోలు ఎన్టీఆర్ – రామ్ చరణ్ లు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇప్పటికే మన్యం వీరుడు ‘అల్లూరి సీతారామరాజు’ గా రామ్ చరణ్ చూపిన ‘రౌద్రం’ ప్రేక్షకులకు చూపించారు. ఈ క్రమంలో విప్లవ వీరుడు ‘కొమరం భీమ్’ గా తారక్ చూపించబోయే ‘రుధిరం’ అక్టోబర్ 22న రానుంది.