మరోసారి టాలీవుడ్ లో అదృష్టం పరీక్షించుకోబోతున్న తెలుగమ్మాయి

0

టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలు హీరోయిన్ లుగా సక్సెస్ అవ్వడం చాలా చాలా కష్టం అయ్యింది. హీరోయిన్ గా తెలుగు సినిమాల ద్వారా తెలుగులో పరిచయం అయినా కూడా తక్కువ సమయంలోనే కనిపించకుండా పోతున్నారు. ఈరోజుల్లో.. బస్టాప్ వంటి సినిమాల్లో కనిపించిన హీరోయిన్ రక్షిత చివరిగా గ్రీన్ సిగ్నల్ సినిమాలో నటించింది. ఆ తర్వాత తమిళ సినిమాల్లో ప్రయత్నాలు చేసి అక్కడ బిజీ అయ్యింది. గత ఆరు సంవత్సరాలుగా తమిళ సినిమా పరిశ్రమలో ఆనందిగా ప్రేక్షకులను అలరించిన ఈ అమ్మడు మళ్లీ తెలుగు సినిమాలో రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. జాంబీరెడ్డి సినిమాలో ఈమె హీరోయిన్ గా నటించింది.

దసరా సందర్బంగా జాంబీరెడ్డిలోని ఈమె లుక్ ను విడుదల చేశారు. తెలుగులో ప్రస్తుతం ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇండియాలో ఇప్పటి వరకు ఇలాంటి జోనర్ లో సినిమా రాలేదు అంటూ దర్శకుడు చాలా బలంగా నమ్మకంగా చెబుతున్నాడు. దానికి తోడు ఈ సినిమాలో హీరోగా తేజ సజ్జ నటిస్తున్నాడు. బాల నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన తేజ ఈ సినిమాతో పూర్తి స్తాయి హీరోగా మారుతున్నాడు. ఈ సినిమాపై ఉన్న ఆసక్తి నేపథ్యంలో సినిమా సక్సెస్ అయితే హీరోయిన్ రక్షిత అలియాస్ ఆనంది టాలీవుడ్ లో సెట్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. మరి ఈసారి అయినా ఈమెకు అదృష్టం కలిసి వచ్చేనా చూడాలి.