ఆహా లో రాబోతున్న పునర్నవి

0

ఒకప్పుడు నటీ నటులు అంటే కేవలం సినిమాల్లో మాత్రమే పరిమితం. కాని ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉంది. టీవీ.. సోషల్ మీడియా.. ఓటీటీ ఇలా అనేక రకాలుగా అవకాశాలు ఉన్నాయి. కష్టపడితే అదృష్టం ఉంటే అన్నింట్లో కూడా స్టార్ గా గుర్తింపు తెచ్చుకోవచ్చు. నటిగా ఉయ్యాల జంపాల సినిమాతో పరిచం అయిన పునర్నవి భూపాలం ఆ తర్వాత అంతగా అవకాశాలు దక్కించుకోలేక పోయింది. అంతా మర్చి పోతున్న సమయంలో అనూహ్యంగా ఈమెకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. అప్పటి నుండి ప్రేక్షకుల ముందుకు ఏదో ఒక ప్లాట్ ఫామ్ ద్వారా వస్తూనే ఉంది. ఇప్పుడు ఆహా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది.

పవన్ సాదినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఒక వెబ్ సిరీస్ లో పునర్నవి కీలక పాత్రలో కనిపించబోతుంది. యూట్యూబ్ కు చెందిన స్టార్స్ తో ఈ వెబ్ సిరీస్ ఆహా కోసం రూపొందుతుంది. త్వరలోనే షూటింగ్ ను పూర్తి చేసి స్ట్రీమింగ్ చేయబోతున్నారట. పున్ను ఈ వెబ్ సిరీస్ లో ఒక మంచి ఎంటర్ టైన్ మెంట్ అందించే పాత్రలో కనిపించబోతుంది.

నటిగా ఆఫర్ల కోసం వెయిట్ చేస్తున్న పున్నుకు ఇది కెరీర్ లో ఒక మరో టర్నింగ్ గా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈమద్య కాలంలో స్టార్స్ కూడా వెబ్ సిరీస్ లపై ఆసక్తి చూపుతున్నారు. సినిమాలు లేకపోవడంతో ప్రేక్షకులు వెబ్ సిరీస్ లను ఎంటర్ టైన్ కోసం ఆధరిస్తున్నారు. కనుక ఆహాలో త్వరలో రాబోతున్న ఆ వెబ్ సిరీస్ అందరిని ఆకట్టుకుంటుందని ఆశిద్దాం.