Templates by BIGtheme NET
Home >> Cinema News >> రెడ్ హాట్ వధువు పరేషానులే

రెడ్ హాట్ వధువు పరేషానులే


చక్కనమ్మ ఏం చేసినా అందమే. నవతరం నాయికల్లో రకుల్ ప్రీత్ సింగ్ ఫ్యాషన్ ఐకన్ గా వెలిగిపోతోంది. రెడ్ హాట్ చీరలో కనిపించినా.. రొటీన్ క్రాప్ టాప్ లుక్ లో కనిపించినా తనకే యాప్ట్ అన్నంతగా సూటవుతున్నాయి ప్రతిదీ. టోన్డ్ బాడీ ఫిట్ లుక్ తో రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల తన అద్భుతమైన ఫోటోలతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

మొన్నటికి మొన్న మాల్దీవుల విహారం నుండి వేడెక్కించే బికినీ ఫోటోలతో రకుల్ సోషల్ మీడియాల్లో తుఫాన్ సృష్టించింది. ఇంతలోనే తాజా ఇన్ స్టాగ్రామ్ ఫోటో హాట్ టాపిక్ గా మారింది. ప్రఖ్యాత వెడ్డింగ్ మ్యాగజైన్ ఖుష్ కోసం వధువు గెటప్ లో రకుల్ ఇచ్చిన ఫోజు కుర్రాళ్ల గుండెల్లో గిలిగింతలు పెట్టించేస్తోందనే చెప్పాలి. ఖుష్ మ్యాగజైన్ డిసెంబర్ కవర్ సంథింగ్ స్పెషల్ గా ఆకర్షణీయంగా దూసుకొచ్చింది.

ఇక రెడ్ లెహెంగాపై ఫ్లోరల్ ఎంబ్రాయిడరీతో అదిరిపోయే లుక్ కనిపిస్తోంది. అలాగే ఆ మెడలో పచ్చల హారం..నుదుటిన పాపిడి బొట్టు ముక్కుకు భారీ ముక్కెర రకుల్ అందాన్ని పదింతలు చేసాయి. ఇంతందమైన వధువు కనికరిస్తే పెళ్లాడేసేందుకు బోయ్స్ ఎప్పుడూ రెడీనే.

వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేసుకుంటూ ఫిట్నెస్ ఫ్రీక్ గా రకుల్ ఇంతందాన్ని మెయింటెయిన్ చేయగలగుతోంది. ఇక కెరీర్ సంగతి చూస్తే.. అర్జున్ కపూర్ సరసన ఓ సినిమా చేస్తోంది. బాలీవుడ్లో చాలా ప్రాజెక్టులకు కమిటవుతోందట. కమల్ హాసన్ ఇండియన్ 2 లో ఆమె కనిపించనుంది. అజయ్ దేవ్ గన్ మూవీకి సంతకం చేసింది. ఇందులో అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.