ఇలా ఎన్నాళ్లు ఉంటుందో! పెదవి విరిచేసిన చరణ్!!

0

Ram Charan Talking About RRR Shooting Plan after Lockdown

Ram Charan Talking About RRR Shooting Plan after Lockdown

వైరస్ మహమ్మారీ విరుచుకుపడుతున్న వేళ దేశవ్యాప్తంగా మోదీ ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. దీంతో అన్ని పరిశ్రమలతో పాటు సినీపరిశ్రమలు స్థింబించిపోయాయి. సినిమాల షూటింగులన్నీ ఆగిపోయాయి. నాలుగైదు నెలలుగా సెట్స్ కెళ్లిందే లేదు. దీంతో మన హీరోలంతా ఈ స్వీయనిర్భంధ కాలాన్ని కుటుంబ సభ్యులతోనే స్పెండ్ చేశారు. ఒక్కొక్కరూ ఒక్కో రకంగా వేపకాయంత వెర్రిని సోషల్ మీడియాల్లో ప్రచారం కూడా చేసుకున్నారు. అయితే ఇలా ఎంత కాలం? విసుగు పుట్టదా? అంటే.. ఇదిగో రామ్ చరణ్ ఇచ్చిన ఆన్సర్ సర్ ప్రైజ్ చేస్తోంది.

చాలా గ్యాప్ తర్వాత ఓ ప్రముఖ మీడియాతో ముచ్చటించిన చెర్రీ .. లాక్ డౌన్ గురించి ప్రస్థావిస్తూ “ఇన్నాళ్లు ఇంట్లోనే ఉండిపోయాను. చాలా విసుగొచ్చింది షూటింగుల్లేక. ఇలానే ఉండడం ఇబ్బందికరం“ అని వ్యాఖ్యానించాడు. షూటింగ్ ఎపుడెపుడా అని ఎదురు చూస్తున్నానని అన్నాడు చరణ్. ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ ఎప్పుడు? అని ప్రశ్నిస్తే.. నేను కూడా మీలానే ఎదురు చూస్తున్నా. మా కంటే మీ వద్దనే అధిక సమాచారం ఉంది! అంటూ తెలివైన ఆన్సర్ ఇచ్చాడు చెర్రీ. ఈ పరిస్థితి ఎప్పటికి మారుతుంది? అంటే.. ఇలా ఎన్నాళ్లు ఉంటుందో చెప్పలేం! అంటూ పెదవి విరిచేశారు చరణ్. జవాబు ఇవ్వకుండా ఎంతో తెలివిగా తప్పించుకున్నారు.

ఆర్.ఆర్.ఆర్ లో అల్లూరి సీతారామరాజు పాత్ర కోసం రాజమౌళి తనను ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు చెప్పిన చరణ్.. ఇది తన అదృష్టం అని వ్యాఖ్యానించారు. అల్లూరి పాత్రను రాజమౌళి ఒక విజువల్ ఫీస్ట్ గా ఆవిష్కరిస్తున్నారని ఇంతకుముందు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ వీడియో రివీల్ చేసింది. చరణ్ ఈ విషయంలో రుణపడి ఉన్నానని వినమ్రంగా తెలిపారు. ఇక అనవసర విషయాలపై అంతగా ఆసక్తి కనబరచని చరణ్ సోషల్ మీడియాలపైనా అంతగా ఆసక్తిని కనబరచరు. ట్విట్టర్ ఫేస్ బుక్ సహా ఇన్ స్టాల్ని వేరే సోషల్ మీడియా టీమ్ ప్రమోట్ చేస్తుందన్న సంగతి తెలిసిందే.