
Rama Rajamouli Proves Her Talent
భారతదేశం గర్వించదగ్గ దర్శకులలో రాజమౌళి ఒకరు. ‘బాహుబలి’ సినిమాతో రాజమౌళి కీర్తి ఖండాలు దాటింది. అయితే రాజమౌళి ఇంతటి గుర్తింపుని పొందటానికి ఆయన ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఒక కారణమని చెప్పవచ్చు. ఎందుకంటే రాజమౌళి ప్రతి సినిమాలో కూడా ఫ్యామిలీ ఇన్వాల్వ్ మెంట్ ఉంటుంది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ స్టోరీ అందిస్తే.. పెదనాన్న శివ దత్తా పాటలకు సాహిత్యాన్ని అందిస్తాడు. ఇక పెద్దన్న కీరవాణి ఆయన ప్రతి సినిమాకి మ్యూజిక్ అందిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో కీరవాణి సతీమణి శ్రీవల్లి మరియు రాజమౌళి తనయుడు కార్తికేయ డైరెక్షన్ డిపార్ట్మెంట్ – మూవీ ప్రొడక్షన్ ని పర్యవేక్షిస్తుంటారు. ఇక కళ్యాణి మాలిక్ – కాంచి – కాల భైరవ ఇలా రాజమౌళి ఫ్యామిలీలోని ప్రతి ఒక్కరూ ఆయన సినిమాకి తమ వంతు కృషి అందిస్తుంటారు. ఇక రాజమౌళి సతీమణి రమా రాజమౌళి సైతం తన భర్త తెరకెక్కించే సినిమాలకి కాస్ట్యూమ్ డిజైనర్ గా సహకారం అందిస్తుంటారు. ప్రతి మగవాడి విజయం వెనుకా ఓ స్త్రీ ఉంటుందంటారు. అలానే రమ మాత్రం రాజమౌళి వెనుకో ముందో కాకుండా ఆయనతోనే ఉండి భర్త సక్సెస్ లో భాగం పంచుకుంటారు.
కాగా రమా రాజమౌళి ‘స్టూడెంట్ నెం.1’ సినిమా నుంచీ రాజమౌళి దర్శకత్వం వహించే సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా ఉన్నారు. అయితే ఆ విషయం చాలా మందికి తెలియదు. కేవలం టైటిల్ కార్డులో ఆమె పేరు పడిన సినిమాలకు మాత్రమే వర్క్ చేసారని అందరూ అనుకుంటారు. రాజమౌళి డిజైన్ చేసిన క్యారక్టర్ ని అర్థం చేసుకొని.. ఆ పాత్రకు తగ్గట్టు సమకూరుస్తూ వస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాకి కూడా కాస్ట్యూమ్స్ డిజైన్ చేసింది. అయితే ఇప్పుడు కాస్ట్యూమ్స్ తో పాటు డైలాగ్ రైటర్ గా కూడా మారుతోందట. ఇటీవలే కరోనా ని జయించి బయటపడిన జక్కన్న ఫ్యామిలీ ఇప్పుడు మళ్ళీ ‘ఆర్.ఆర్.ఆర్’ పై ఫోకస్ పెట్టారట. ఈ క్రమంలో ‘ఆర్.ఆర్.ఆర్’ కోసం విజయేంద్ర ప్రసాద్ అందించిన కీలకమైన సన్నివేశాలకి రమా రాజమౌళి డైలాగ్స్ రాస్తోందట. ఇప్పటి వరకు కాస్ట్యూమ్ డిజైనర్ గా గుర్తింపు పొందిన రాజమౌళి సతీమణి ఈ సినిమాతో డైలాగ్ రైటర్ గా కూడా ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేస్తోందట. మరి రమా రాజమౌళి అందించే డైలాగ్స్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటాయో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
