Templates by BIGtheme NET
Home >> Cinema News >> రేంజ్ రోవర్ కారు కొని ఛిల్ల్ అవుతున్న స్టార్ హీరోయిన్!!

రేంజ్ రోవర్ కారు కొని ఛిల్ల్ అవుతున్న స్టార్ హీరోయిన్!!


సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు వారి లగ్జరీని కార్ల రూపంలో బంగ్లా రూపంలో ప్రదర్శిస్తూ ఉంటారు. సినిమాలతో ఫుల్ స్వింగ్ లో ఉన్నప్పుడే కార్లు బంగ్లాలు కొనడం చూస్తూనే ఉంటాం. ఇక సినిమా హీరోలు హీరోయిన్లు తమ అభిరుచులకు తగ్గట్టుగా కార్లను కొనుగోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. తాజాగా ఈ జాబితాలోకి కన్నడ భామ రష్మిక మందన చేరింది. తన మోస్ట్ ఫేవరేట్ రేంజ్ రోవర్ ఎస్ యూవీ కారును కొనుగోలు చేసింది భామ. అనంతరం కారు ముందు ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతేగాక ఇలా తనకు సంబంధించిన అన్ని విషయాలు షేర్ చేసుకోవడం తనకు ఇష్టం ఉండదని చెప్పింది. కానీ ఈసారి షేర్ చేస్కుంటున్నాను. “నేను సాధారణంగా చాలా వరకు ఇలాంటివి నాకోసం కొనుగోలు చేస్తుంటా. కానీ ఈసారి మీతో ఈ విషయాన్ని షేర్ చేసుకోవాలనిపించింది.

ఎందుకంటే నా జర్నీలో మీరు కూడా భాగమయ్యారు. నేను మిమ్మల్ని ఎంతగా ఇష్టపడుతున్నానో మీకు తెలియాలి. ఇది మీ కోసమే.. లవ్ యూ” అంటూ రేంజ్ రోవర్ ముందు చిల్ చేస్తూ స్టైలిష్ గాగుల్స్ పెట్టుకుని దిగిన ఫొటోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో రష్మిక కారుతో దిగిన పిక్ తెగ వైరల్ అవుతోంది. అలాగే సెలబ్రిటీల నుండి అమ్మడికి విషెస్ కూడా వస్తున్నాయట. ఇక రష్మిక గతేడాది సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరూ నితిన్ సరసన భీష్మా సినిమాలు చేసి సూపర్ హిట్స్ అందుకుంది. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమా చేస్తోంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక పక్కా పల్లెటూరు అమ్మాయి పాత్రలో నటిస్తూ చిత్తూరు యాస మాట్లాడబోతుంది. అలాగే ఇటీవల రెండు బాలీవుడ్ సినిమాలకు కూడా సంతకం చేసింది. మొత్తానికి అమ్మడి కెరీర్ పీక్స్ లో ఉందనే చెప్పాలి.